*ఎన్.సి.సి‌. ఉత్తమ అధికారిగా ఆలేరు వెంకటేష్ దూడల * యాదాద్రి భువనగిరి జిల్లా 30 నవంబర్ ప్రజాపాలన:

Published: Friday December 02, 2022
ఎన్.సి.సి‌. 75 వ దినోత్సవం సందర్భంగా హన్మకొండ హరిత హోటల్ లో కమాండర్ కల్నల్ హెచ్. వి. దూబే ఆద్వర్యం లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.  వరంగల్ గ్రూప్ కమాండర్ కల్నల్ హెచ్. వి. దూబే చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. ఆలేరు ఎన్ .సి.సి. అధికారి దూడల వెంకటేష్ బెస్ట్ ఎన్. సి.సి. అధికారిగా అవార్డు అందుకున్నారు.
జాతీయ అవార్డుకు ఎంపికైన దూడల వెంకటేష్ ను కల్నల్  అభినందించారు. వరంగల్ ఏ ఓ, 10వ తెలంగాణ బెటాలియాన్ కమాండింగ్ అధికారి కల్నల్ అజయనంద్ ఖండూరి, అడ్మినిస్ట్రేషన్ అధికారి మహేష్ జగతప్, ఖమ్మం మరియు 8వ బాలిక బెటాలియాన్ సి ఓ లు, ఏ ఓ లు. స్నేహితులు బంధువులు పులువురు దూడల వెంకటేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ మేజర్ సుహాస్ కదం, బెటాలియన్ హావల్దార్ మేజర్ మహ్మద్ గౌస్, క్వాట్టర్ మాస్టర్ ఇజాజ్, ట్రైనింగ్ హావల్దార్ నారాయణరెడ్డి, విజయ్, కృష్ణన్ కుమారస్వామి, కెప్టెన్ సతీష్, కెప్టెన్ సదానందం, లెఫ్ట్నెంట్ స్వామి, రాధాకృష్ణ, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.