కుర్నవల్లిలో పోషణ మాసోత్సవాలు.. హాజరైన సర్పంచ్ ఐలూరి లక్ష్మీ..

Published: Wednesday September 14, 2022
తల్లాడ, సెప్టెంబర్ 13 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని కుర్నవల్లి గ్రామంలో మంగళవారం పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అన్న ప్రసన్న వేడుక, విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఐలూరు లక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఇటువంటి మాస ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయన్నారు. ఈ కార్యక్రమంలో సంధ్యారాణి, సిడిపిఓ కృష్ణకుమారి, కోఆర్డినేటర్ బిందు, ఎంపీటీసీ కళావతి, సూపర్వైజర్ సత్యవతి, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు  పాల్గొన్నారు.