పోడు భూముల హక్కుల, సాధనకై పాదయాత్ర ప్రారంభం

Published: Saturday June 11, 2022
 మంచిర్యాల టౌన్, జూన్ 10, ప్రజాపాలన : పోడు భూముల హక్కు పత్రాల సాధనకై ఆదివాసీ సంఘాల ఐక్య పోరాట కమిటీ చలో ఐ.టి.డి.ఎ., ఉట్నూర్  పాదయాత్ర ప్రారంభించారు. ఈ సదర్భంగా పాదయాత్రను ఉద్దేశించి ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి మాట్లాడుతూ
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోష గూడ గ్రామ ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములు విషయములో అతిఉత్సాహన్ని ప్రదర్శిస్తు అటవీ  అధికారులు తమ తప్పులను కప్పి పుచ్చుకొవడానికి ఇక్కడ పోడు భూములు లేవని చేప్పుతున్నారు. అడవిలో ఉన్న ఆదివాసులను బయటకు పంపించే ప్రయత్నాన్ని అటవీ అధికారులు మానుకోవాలని ఆయన హెచ్చరించారు.జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పారెస్టు డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆదివాసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు.  ఈ  సమస్యలు ఒక్క కోయపోష గూడ లోనే కాకుండా మిగితా ప్రాంతాలలో కూడా  ఉన్నాయని ఆయన అన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం వేంటనే తగు చర్యలు చేపట్టని లేని యెడల ఆదివాసీ సంఘాలుగా పోడు భూముల సమస్యను తీవ్రంగా భావించి రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆందోళనలు చేపడతామని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో   తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుడ్మేత తిరుపతి, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేందోర్ ప్రభాకర్, ఆదివాసీ సేన మంచిర్యాల జిల్లా ఆధ్యక్షులు కోట్నక్ తిరుపతి, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపు రావు, సిపిఎం యంల్ శీనివాస్, ప్రజాపంత నంది రామయ్య, ప్రగతిశీల మహిళ సంఘం సభ్యులు జాన్సి,జ్యోతి, మంగ, వ్యవసాయ కార్మిక సంఘం నూతన్, కోయపోష గూడ గ్రామస్థులు అందరు,అన్ని ఆదివాసీ ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.