కరోనా కట్టడికి దోమ గ్రామ పంచాయతీ సమావేశం..

Published: Tuesday April 27, 2021
పరిగి 26 ఏప్రిల్ ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, కరోనా వైరస్ కట్టడికి సోమవారం దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి సమక్షంలో పంచాయతీ పాలకవర్గ సమావేశం జరిగింది. గ్రామ స్థాయి లో వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకువాల్సిన చెర్యల గురుంచి ఉప సర్పంచ్ తో పాటు పంచాయతీ సభ్యులు పలు సలహాలు ఇచ్చారు. మంగళవారం ఉదయం దోమలోని వ్యాపారులు, పెద్దలు, యువకులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చి లాక్ డౌన్ విషయం చర్చించాలని నిర్ణయించారు. అందరి సంపూర్ణ మద్దతు ఉంటేనే బాగుంటుంది అని సమావేశంలో చర్చించారు. ఇప్పటికే బ్లీచింగ్ పౌడర్, శానిటైజేశ న్ చేశామని సర్పంచ్ కె రాజిరెడ్డి తెలిపారు.పంచాయతీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అందుకు సిబ్బంది పంచాయతీకి సమాచారం ఇవ్వాలని లేని పక్షంలో సిబ్బందిపై చర్యలుంటాయని పాలకవర్గం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాల్. సభ్యులు లక్ష్మణ్. మైను. వసంత రావు. నిరోషా.సాయి. బుగ్గమ్మతదితరులు పాల్గొన్నారు.