భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ప్రజా పాలన ప్రతినిధి. కంటతడి పెట్టించిన అంబేద

Published: Saturday October 08, 2022
నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం మీ అందరికి ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. నా రాజీనామా లేఖను 27 సెప్టెంబరు 1951న ప్రధానమంత్రి గారికి సమర్పించి.. నా రాజీనామా తక్షణమే ఆమోదించ వలసిందిగా కోరాను. కానీ శుక్రవారం 28 తర్వాత పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు మంత్రి పదవి భాద్యతలు నిర్వహించాలని కోరారు. రాజ్యాంగం మీద గౌరవం, ప్రధాని అభ్యర్థన మేరకే జరిగిందని మీరు గ్రహించాలి. మంత్రి పదవికి రాజీనామా చేసిన కారణాలను సభలో వివరణ ఇవ్వడానికి అనుమతి ఉన్నప్పటికీ పాటించ లేదు. నేను గత కొన్ని రోజులు బాగా ఆలోచించి చివరికి వివరణ ఇవ్వాలని ముందుకు వచ్చాను. మంత్రివర్గం లో అభిప్రాయం భేదాలు ఉన్నప్పటికీ కొన్ని సార్లు బయాటపెట్టడం సవ్యంగా ఉండదు. తన రాజీనామాకు గల కారణాలు తెలపకుంటే ప్రజలు అపార్థం చేసుకోవచ్చు. ఏదో లోపం వున్నది కాబట్టే కారణాలను చెప్పలేదని భావించ వచ్చు. ప్రసార మాధ్యమాలు దుష్ప్రచారం చేయవచ్చు.. ఆగస్టు 1946 లోనే మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు నేను కేంద్ర మంత్రి పదవికి అనర్హుడుగా భావించి నన్ను తీసుకోలేదేమో అనుకున్నాను.
తన స్థాయిని తగ్గించేందుకే
 నెహ్రు గారు నన్ను న్యాయశాఖ మంత్రిగా తన మంత్రివర్గం లోకి ఆహ్వానించినప్పుడు నాగు ఆశ్చర్యం వేసింది. దేశాభివృద్ధికి పాటుపడే సమయం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేయడమే ఉత్తమం అని భావించి మంత్రి వర్గంలో చేరాను.నిజానికి న్యాయ శాఖ మంత్రి పదవి ఒక నామమాత్రపు పదవి తప్ప దానికి ప్రభుత్వాన్ని నడిపే ఎలాంటి అవకాశం ఉండదు. ఇంతకూ ముందు వైస్రాయ్ కౌన్సిల్లో ముఖ్యమైన శాఖలను నిర్వహించిన అనుభవం వుంది కాబట్టి నా విద్య అనుభవానికి తగిన శాఖ ఇవ్వమని అడిగితె త్వరలోనే ప్రణాళిక మంత్రి శాఖను కూడా అదనంగా ఇస్తానని మాట ఇచ్చ్హారు. నేను మంత్రి వర్గంలో కొనసాగినంత కాలం ప్లానింగ్ డిపార్టుమెంట్ ఏర్పడలేదు. సరికదా ఎన్నో సందర్భాల్లో ఎన్నో నిర్ణయాత్మక కమిటీలు ఏర్పడినప్పటికీ నన్ను ఏ కమిటీలో చేర్చ లేదు. చాలా సార్లు మంత్రివర్గ కూర్పులు మార్పులు జరిగినా నా పొజిషన్ మాత్రం మారలేదు. నాకున్న విద్య అర్హతలు సమర్థత ఎప్పుడు సద్వినియోగం చేయడానికి నోచు కోలేదు.
అంబేద్కర్  విద్య అర్హతలు, సమర్థతకు గుర్తింపు ఏది?
కొంత .మందికి రెండు మూడు శాఖలు ఇచ్చారు. ఆర్ధిక, ఫైనాన్స్ శాఖల పైన ఉన్న నా జ్ఞానాన్ని ఏమాత్రం వినియోగించుకునే ఆలోచన ప్రధాన మంత్రి గారు చేయలేదు. నా అసంతృప్తికి మరో కారణం షెడ్యూల్ కులాలకు, వెనకబడిన తరగతుల వారికి తగిన న్యాయం జరగక పోవడం.ముఖ్యంగా బి సి లకు రాజ్యంగంలో ప్రత్యక్ష రక్షణ ఏర్పాట్లు చేసే అవకాశాన్ని రాజ్యాంగ సభ అనుమతించ లేదు. దానికి బదులు రాష్జ్త్రపతి గారు ఒక కమిషన్ ను వేస్తె ఆ కమిషన్ పంపే సిఫార్సులను ఆధారంగా తీసుకొని వారికి కార్య నిర్వాహక మండలి ( ఎక్సిక్యూటివ్ గవర్నమెంట్ ) న్యాయం చేయవలసి వుంది. కానీ రాజ్యాంగం అమలులోకి వచ్చి సంవత్సరం గడిచిన ఇప్పడికి ప్రభుత్వానికి ఆ కమిసన్ గురించి ఆలోచన కూడా రాలేదు. బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు షెడ్యూల్డ్ కులాల వారికి ఎలాంటి చట్టపరమయిన రక్షణలు కల్పించ లేదు. పైగా రాజ్యాంగ పరిషత్తును ఏర్పరిచినప్పుడు అది షెడ్యూల్డ్ కులాల వారికీ ఏరకంగా ఉపయోగ పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. రాజ్యాంగ పరిషత్తు లో ఎస్ సి కులాలవారికి కల్పించిన రక్షణలు నాకు తృప్తి కలిగించ లేదు. అయినప్పటికి నేను ప్రభుత్వం కొంత ఆశాజనకంగా పనిచేస్తుందని నమ్మకంతో ఒప్పుకున్నాను. కానీ వాస్తవంగా జరుగుతున్నదేమిటి? ఇప్పటికి వారి పరి పరిస్థితులు మారలేదు. వారిపై నిత్యం అత్యాచారాలు దౌర్జన్యాలు ఎప్పటిలాగే కోనసాగుతునేఉన్నాయి.రోజూ నా దగ్గారికి వందల సంఖ్యలో విన్నపాలు వస్తూనే ఉన్నాయి. హిందువులు తమ ఆకృ త్యాలను ఆపలేదు. పోలీసులు కేసులు రిజిస్టర్ చెయ్యడం లేదు. ప్రపంచంలో ఇలాంటి దారుణాలు ఎక్కడైనా ఉన్నాయా అని నేను విస్తు పోతున్నాను. ప్రభుత్వం ఎందుకు ఈ దారుణాలను ఆరికట్టలేకపోతుందో నాకు తెలియడం లేదు. ప్రధానికి ముస్లింల పైన వున్నా ఆదరణ, శ్రద్ద ఎస్ సి ల పై ఎందుకు లేదో నాకు ఆశ్చర్యంగా వుంది. ముస్లింలకు రక్షణ కల్పించడంలో ఏమాత్రం అశ్రద్ధ కలిగిన అవసరమైతే నేను ప్రధానిని కూడా నిలదీస్తాను కానీ కేవలం ముస్లింలకే రక్షణ కావాలా? ఎస్ సి లకు, ఎస్ టీ లకు ఇండియన్ క్రిస్టియన్లకు అవసరం లేదా? వాస్తవానికి ముస్లింల కంటే ఎస్ సి, ఎస్ టీ , ఇండియన్ క్రిస్టియన్లకే ఎక్కువ రక్షణ కావాలి..
సమస్య రాజేయ్యాలనే
నేను ఎస్ సి ల విషయమై మాట్లాడుతూ వారికి కల్పించిన 12.5 % రిజర్వేషన్ లబ్ది వారికి జరగడం లేదని అన్నప్పుడు కేంద్ర హోమ్ మినిస్టరుగారు నాపై నమ్మకం లేకనో ఏమో కానీ ఆయన ప్రభుత్వంలోని అన్ని డిపార్టుమెంట్లకు లేఖ రాసి ఎస్ సి ల రిజర్వేషన్ అమలుపై నివేదిక తెప్పించుకున్నాడు. నివేదికలో ఎక్కువ శాతం నిల్(౦) అని కొన్ని రిపోర్టులలో దాదాపు నిల్ అని తెలియచేయబడింది. నా రాజీనామాకు మూడవ కారణం విదేశీ వ్యవహారాలు. ఇది నన్ను చాలా బాదిస్తున్న విషయం. . దురదృష్ట వశాత్తు గడచినా నాలుగేళ్లలో మనకు అందరు దూరమయ్యారు. ఇప్పుడు మనం మన వార్షిక బడ్జెట్ లో కోట్ల రూపాయలు కేవలం సైన్యం మీదనే ఖర్చవు చేస్తున్నాము. మొత్తం ప్రపంచంలో మనకు ఇలాంటి ఉదాహరణ ఎక్కడ కనిపించదు.దీనికి కారణం మనకు స్నేహితులు ఎవ్వరు లేకపోవడమే. మన విదేశీ వ్యవహారాలలో మనకు ముఖ్యంగా కనిపించేది పాకిస్తాన్. ఇంకా దీనిని విశ్లేషిస్తే కాశ్మిర్ సమస్య, తూర్పు బెంగాల్ లోని భారతీయుల అవస్థలు. కాశ్మీర్ సమస్యను మనం పాకిస్తాన్ కు ముడుపెడుతున్నాము.. నా ఉద్దేశంలో హిదువులు, బుద్ధులు ఎక్కువగా వున్నా ప్రాంతాన్ని ఇండియాకు ముస్లింలు ఎక్కువగా వున్న ప్రాంతాన్ని పాకిస్తాన్ కు ఇస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం కలుగుతుంది.నా అసంతృప్తికి నాలుగవ కారణం. ఫారం కమిటీ, డిఫెన్స్ కమిటీలు వున్నాయి. వాటిలో ఉన్న సభ్యులకు తప్ప వేరే ఇతర సభ్యులకు వీటి గురించి ఎలాంటి అవగాహన ఉండదు. ఆ కమిటీలో భాద్యత గానీ పాలిసీ తయారు చేయడంలో ఎవ్వరికి ఏ అవకాశం లేదు.
వివక్షకు గురైన హిందూ కోడ్ బిల్లు
అది హిందూ కోడ్ బిల్లు. ఆ  బిల్లు ఏవిధంగా వివక్షకు గురి అయ్యిందో మీ అందరికి వివరిస్తాను. ఇది ఏప్రిల్ 11 న పార్లమెంటులో ప్రవేశపెట్ట బడింది. నాలుగు సంవత్సరాల పరిశీలనలో , కేవలం నాలుగు క్లాజులు ఆమోదింపబడి ఏ మాత్రం కనికరానికి నోచుకోకుండా ఏ ఒక్క కన్నీటిబొట్టుకు నోచుకోకుండా చివరికి హత్య చేయబడింది. అది జీవించి వున్న కాలంలో ఒక సంవత్సరం పాటు కనీసం సెలెక్ట్ కమిటీకి కూడా పంపబడలేదు.అది ఏప్రిల్ 9 1948 నా సెలెక్ట్ కమిటీకి నివేదించారు .తిరిగి 12 ఆగస్టు 1948 న హౌజ్ కు వచ్చింది. దానిని 31 ఆగస్టు 1948 న చర్చకోసం ప్రతిపాదించడమైనది, కానీ దానిని 1949 ఫిబ్రవరి సమావేశాలవరకు చర్చకు రావడానికి అనుమతి ఇవ్వలేదు. చర్చ మొదలయిన తరువాత 1949 ఫిబ్రవరిలో 4 రోజులు, 1 రోజు మార్చ్ లో , ఏప్రిల్ లో 2 రోజులు, డిసంబరులో 1 రోజు ఇవ్వడం జరిగింది. ఇక 1950 సంవత్సరం పొడుగునా దీనిని చర్చకు రానివ్వలేదు.1951 లో ఫిబ్రవరి 5 ,6 ,మరియు 7 తేదీలలో చర్చించారు.పార్లమెంటుకు చివరి సెషన్ కాబట్టి ఏ బిల్లును ఆమోదించడమో లేదా నూతన పార్లమెంటుకు వదిలిపెట్టడమో జరగాలి. అందుకని 17 సెప్టెంబర్ 1951 న క్లాజ్ తర్వాత క్లాజ్ పద్దతిలో చర్చకు తీసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి గారు మొత్తం బిల్లు చర్చించి ఆమోదించడం సాధ్యం కాదు కాబట్టి బిల్లును విడదీసి చిన్న చిన్న భాగాలుగా పరిశీలించి చట్టం రూపంలో చేయవచ్చని చెప్పారు. నాకు కనీసం కొంతైన ముందుకు వెళతాము అని అనిపించింది.ప్రధాని ఏ బిల్లులోని వివాహాలు, విడాకుల భాగంగా ప్రవేశ పెట్టామన్నారు. దీనిపై రెండు, మూడు రోజుల చర్చ జరిగిన తర్వాత ప్రధాని గారు మరొక్క ప్రతిపాదన చేశారు అది నా నది నెత్తిన పిడుగు లాంటిది. అది ఏ బిల్లును మొత్తంగా వెనెక్కి తీసుకోవాలని. నేను జీవితంలో అతి పెద్ద షాక్ కు గురి అయ్యాను.
కృంగిపోయిన అంబేద్కర్   
నోట మాట రాలేదు.సమావేశాలు ముగిసే టైం అయిపోతుంది కాబట్టి ఇంతకన్నా అతి ముఖ్యమైన బిల్లులు వున్న నేను అర్థం చేసుకునే వాడిని . కానీ దీనికి బదులుగా బనారస్ మరియు అలీగఢ్ విశ్వ విద్యాలయాలల బిల్లులు ముందుకు తీసుక రావడం నన్నెంతో కృంగ తీసింది. ఏ బిల్లుకు నాకు ప్రభుత్వ యంత్రాంగం నుండి గానీ చీఫ్ విప్ నుండి గానీ ఏ మాత్రం సహాయ సహకారాలు దొరక లేదు. సభ్యులకు టైం కేటాయించడంలో నియమాలను ఒక్కడు పెట్టడం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఏ బిల్లుకు పూర్తీ వ్యతిరేకి. ఆయన ఎక్కువ సమయం సభలో వుండకపోయేవారు. అతనిపై ప్రధానికి ఏ మాత్రం ఆక్షేపణ లేకపోగా ఆయనతో ఏంటో స్నేహంగా సఖ్యానంగా వుండే వారు.ఆశ్చర్యంగా బిల్లును డ్రాప్ చేయడానికి చూపిన కారణం హాస్యాస్పదంగా వుండింది. బిల్లు పట్ల మెజారిటీ వ్యతిరేకంగా వున్నారని. పార్టీ మీటింగ్లో కూడా నాకు వ్యతిరేకత కానీపింఛ లేదు. ఏ మధ్యనే జరిగిన సమావేశంలో 120 మంది లో కేవలం 20 మంది బిల్లును వ్యతిరేకించారు.కేవలం మూడున్నర గంటల్లో 44 క్లాజులను పాస్ చేయడం జరిగింది.ప్రతి సారి బిల్లుపాట్ల అనుకూలతనే కనిపించింది తప్ప వ్యతిరేకత లేదు. నేను మంత్రివర్గంలో కొన్ని కారణాల వలన ఇష్టం లేకున్నా బలవంతంగా వున్నాను. ఎందుకంటే రాజ్యాంగం పూర్తీ చేసి దేశ ప్రజలకు అర్పించే భాద్యత నాపై వున్న విషయం నన్ను పదే పదే  ఉత్తేజ పరిచేది. ఇక హిందూ కోడ్ బిల్లు మన భారత దేశ చరిత్రలోనే ఇందుకు ముందెన్నడూ లేనివిదంగా భవిష్యత్తులో కూడా ఉండదేమో అన్నంత ఉన్నతంగా బిల్లును తీర్చి దిద్దాను.
ఆరోగ్యాన్ని పణంగా పెట్టి..  అహర్నిశలు కృషి చేసి.. 
28 నవంబర్ 1949 నా ప్రధానమంత్రి గారు ఇంకేమి అక్కర లేదు ప్రభుత్వం ఏ బిల్లు పట్ల పూర్తిగ కట్టుబడి వున్నది అన్నారు. అలాగే 19 డిశంబర్ న ఏ బిల్లు మనకు ఆర్ధిక, సామాజిక న్యాయాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి దీని పట్ల ఎవరికీ ఏమాత్రం రవ్వంత అనుమానం కూడా వున్న కూడదు అన్నారు. 26 సెప్టెంబర్ 1951 న ఏ సమావేశాలలోనే ఏ బిల్లు ఆమోదం పొందాలని విశ్వసిస్తున్నాని అన్నారు.ఇంత  చెప్పిన తరువాత ప్రధానిని ఎందుకు నమ్మ కూడదో నాకు అర్థం కాదు. ప్రధాని వాగ్ధానాలకు ఆచరణలు ఇంట వ్యత్యాసం ఉంటె అది నా తప్పు కాదు. ఏ దేశ మంత్రివర్గం నుండి నేను బయటికి వెళ్లి పోవడం ఏ ఒక్కరికి పెద్ద విచారం కాకపోవచ్చు. ఏది ఏమైనా నేను మంత్రిగా కొనసాగిన కాలంలో నా పట్ల సాదర అభిమానాలు చూపిన నా స్నేహితులందరికీ నా ధన్యవాదాలు. నేను పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడం లేదు కాబట్టి పార్లమెంట్ సభ్యులందరికి నా కృతఙ్ఞతలు.హిందూ కోడ్ బిల్లు కోసం అంబెడ్కర్ ఎంత కృషి చేసాడో చివరికి ఎంత వంచనకు గురి అయ్యి ఎంత మానసిక క్షోభ అనుభవించాడో మనం ఊహించ వచ్చు. అయితే మన దేశ జనాభాలో సగం వున్న స్త్రీలు అంబేద్కరుగారికి ఎంతగా రుణ పడి ఉండాలో ఆలోచించాలి.
 
సాయిబాబా. బిట్ర.