క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆటలో పాల్గొనాలి ** అదనపు కలెక్టర్లు చాహాత్ బాజ్పాయ్, రాజేశం **

Published: Friday February 10, 2023

 

ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 9 (ప్రజాపాలన, ప్రతినిధి) : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడలలో పాల్గొనాలని జిల్లా అదన కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, రాజేశం లు అన్నారు. బుధవారం ఎంపీపీ స్పాట్ మేట్ సెషన్ 2 ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవం కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలకు క్రీడా పోటీలను నిర్వహించిన జడ్పీటీసీ అరిగేలా నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్లు విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి వారిలోని నైపుణ్యమును వెలికితీస్తున్నారని, విద్యతో పాటు క్రీడల అభివృద్ధికి చేస్తున్న అరిగేల సోదరులను అభినందించారు. జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్ లు మాట్లాడుతూ గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వీరా పోటీలలో విద్యార్థులు పాల్గొనడం సంతోషదాయకమని, సంబంధిత ఉపాధ్యాయులు పి ఈ టి ల కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థుల కోసం మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డీఈవో పర్ష అశోక్ మాట్లాడుతూ ఆటల పోటీలలో విద్యార్థుల మధ్య స్నేహబంధం ఏర్పడుతుందని ఆటలతో మెలుకువలు నేర్చుకుంటారని విద్యార్థులు విద్యతోపాటు క్రీడలలొ రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, ఎంపీడీవో శశికళ, పరీక్షల సహాయకమిషనర్ ఉదయ్ బాబు, ఎంఈఓ మనుకుమార్, ఉత్తమ ఉపాధ్యాయుడు ధర్మపురి వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ చారి, శరత్ యాదవ్ మధుసూదన్, ప్రిన్సిపాల్ శ్రీనాథ్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 9 (ప్రజాపాలన, ప్రతినిధి) : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడలలో పాల్గొనాలని జిల్లా అదన కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, రాజేశం లు అన్నారు. బుధవారం ఎంపీపీ స్పాట్ మేట్ సెషన్ 2 ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవం కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలకు క్రీడా పోటీలను నిర్వహించిన జడ్పీటీసీ అరిగేలా నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్లు విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి వారిలోని నైపుణ్యమును వెలికితీస్తున్నారని, విద్యతో పాటు క్రీడల అభివృద్ధికి చేస్తున్న అరిగేల సోదరులను అభినందించారు. జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్ లు మాట్లాడుతూ గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వీరా పోటీలలో విద్యార్థులు పాల్గొనడం సంతోషదాయకమని, సంబంధిత ఉపాధ్యాయులు పి ఈ టి ల కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థుల కోసం మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డీఈవో పర్ష అశోక్ మాట్లాడుతూ ఆటల పోటీలలో విద్యార్థుల మధ్య స్నేహబంధం ఏర్పడుతుందని ఆటలతో మెలుకువలు నేర్చుకుంటారని విద్యార్థులు విద్యతోపాటు క్రీడలలొ రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, ఎంపీడీవో శశికళ, పరీక్షల సహాయకమిషనర్ ఉదయ్ బాబు, ఎంఈఓ మనుకుమార్, ఉత్తమ ఉపాధ్యాయుడు ధర్మపురి వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ చారి, శరత్ యాదవ్ మధుసూదన్, ప్రిన్సిపాల్ శ్రీనాథ్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.