వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

Published: Friday July 02, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 01, ప్రజాపాలన : అంతర్జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం వైద్యనిపుణులు డాక్టర్ తాటిపల్లి శ్రీధర్, జైన సరిత, జైన రామకృష్ణలను, చార్టర్డ్ ఎకౌంటెంట్ డే సందర్భంగా సి ఎ గడ్డం సూర్య ప్రకాష్ గారిని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ పుల్లూరి బాల మోహన్, వాసవి క్లబ్ అధ్యక్షులు కాచం సతీష్, కార్యదర్శి కేశెట్టివంశీకృష్ణ, కోశాధికారి నలుమాసు ప్రవీణ్ పాల్గొన్నారు.