గోమయ ప్రమిదలను ఉచితంగా పంపిణీ చేసిన విశ్వహిందూ పరిషత్ నాయకులు

Published: Tuesday November 08, 2022
బెల్లంపల్లి నవంబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోమయ, ప్రమిదలను ఉచితంగా పంపిణీ చేసినట్లు విశ్వహిందూ పరిషత్ సహాయ కార్యదర్శి గోలి శ్రీనివాస్ సోమవారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
గోమయ  అంటే గోమయం లో లక్ష్మి నివసిస్తున్నదని,శుభానికి సూచిక అని, గోమాతల వల్ల మనిషి ఆహారం తయారు నేర్చుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మనం వాటి మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, ఆధునిక యుగంలో యాంత్రీకరణం జరిగినా, ఇంకా రైతులు గో ఆధారంగా మాత్రమే వ్యవసాయం చేస్తున్నారని, ఆ సంస్కృతిని కాపాడడం మన బాధ్యత అని అన్నారు.
 దైవ కార్యక్రమాలు చేయడమే  కాకుండా, గోపూజ చేయడం వల్ల, వచ్చే తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను, నేర్పిన వార మౌతామని,  అందుకు గోరక్ష చేయాలని ప్రజలను కోరారు. 
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా గోరక్ష విభాగం అధ్యక్షుడు కామెర నారాయణ, పూజారి రాము, తదితర భక్తులు పాల్గొన్నారు.