అశ్వాపురంలో వారాంతపు సంతకు స్థలం కేటాయించండి. సర్పంచ్ శారద. అశ్వాపురం ( ప్రజా పాలన.)

Published: Saturday November 05, 2022

అశ్వాపురంలో వారాంతపు సంతకు స్థలం కేటాయించండి. సర్పంచ్ శారద.

అశ్వాపురం ( ప్రజా పాలన.)
 గ్రామపంచాయతీలో2009 సంవత్సరం కంటే ముందు అశ్వాపురం మెయిన్ రోడ్డుకు ఆర్ అండ్ బి రోడ్ కి ఇరుప్రక్కల వారాంతరపు సంత జరిగేది. ఒకరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్  శ్రీమతి ఉషా రాణి  రెవెన్యూ కార్యాలయానికి వస్తు ఆర్టీసీ బస్టాండ్ వైపు చూడగా పిచ్చి చెట్లు పెరి గీ చిట్టడ వి లా కనపడగా ఆ ప్రాంతంలో కొన్ని సంచార జాతులు. బిచ్చగాళ్ళు ఉన్నట్టు గుర్తించి అప్పట్లో ఉన్న రెవిన్యూ అధికారి. మరియు మండల అభివృద్ధి అధికారిని పిలిచి ఇక్కడ ఏం జరుగుతున్నది అన్ని విచారించగా ఆ ప్రాంతంలో అసాంఘి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకొని అప్పటి సర్పంచ్ ఇస్లావత్ నాగ ని పిలిచి ఇచ్చట మీరు బస్టాండ్ ఆభరణాన్ని బాగు చేసుకుని ఇందులో వారాంతరపు సంత జరిపించమని రాతపూర్వకంగా ఇచ్చినారు. దానిని ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించి2009 సంవత్సరం నుండి వారాంతర భూసంతను జిల్లా పంచాయతీ అధికారి. మరియు కలెక్టర్ గారి అనుమతితో ఇచ్చట సంత వేలంపాట వేసి గిరిజనులకే ఇస్తున్నారు. ఈ సంతకు అశ్వాపురం మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల వారు. కూర కాయలు. చికెన్. మటన్. చాపలు మరియు బట్టలు కుండలు ఇలా అనేకము ప్రతి సోమవారము ఇక్కడ సంతలో అమ్ముచున్నారు. ఇక్కడ గిరిజన సంతతికి చెందినవారు. గుత్తి కోయలు ఎక్కువగా పాల్గొంటారు.2014 సంవత్సరంలో పేద ప్రజలు కొంతమంది ఆక్రమించుకొని గుడిసెలు వేసుకోవగా ఇప్పుడున్న సర్పంచ్ శ్రీమతి బానోతు శారద గారి ఆధ్వర్యంలో రెండుసార్లు గుడిసెలను తీసివేయటం జరిగినది.1986 లో బస్ స్టేషన్ నిర్మించినారు కానీ6 నెలల తర్వాత బస్సులు బస్టాండ్ కు రాలేదు. ఇప్పటివరకు రోడ్డు పక్కనే బస్సులు ఆగుతున్నవి. ఈమధ్య ఆర్టీసీ అధికారులు సర్పంచ్ గారిని. కార్యదర్శి గారిని కలిసి మీకు వచ్చే ఆదాయంలో కొంత మా సంస్థకు ఇవ్వమని కోరినారు. మాకు ఆ అధికారం లేదు మీరు రాతపూర్వకంగా ఎంత ఇవ్వాలో తెలియజేసినట్లు అయితే పై అధికారులకు తెలియజేస్తామని చెప్పగా. వారు గత నెల31-10-2022 నుండి బస్సులు బస్టాండ్ కు వచ్చుచున్నవి. బస్సులు వచ్చినట్లయితే మా గ్రామానికి మంచిది ఆ ప్రాంతము అభివృద్ధి జరుగుద్ది మేము వ్యతిరేకులం కాదు. కానీ బస్టాండు కూలిపోయే దశకు చేరుకున్నది ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చును. ఇచ్చట ఉండే వాళ్లకు నష్టం జరిగే అవకాశం ఉంది. బస్టాండు ప్రాంతము2-5 రెండున్నర ఎకరాలు విస్తీర్ణంలో ఉన్నది. ఇందులో మేము30 శాతం ప్రదేశాన్ని వాడుకుంటున్నాము. మార్కెట్ మటన్ చికెన్ షాపులు ఉన్న ప్రాంతాన్ని అప్పటి ప్రభుత్వము ఇచ్చినది. ఈ ప్రదేశాన్ని ప్రతిరోజు గ్రామపంచాయతీ సిబ్బంది పిచ్చి మొక్కలు మొలవకుండా చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేస్తుంటారు మొత్తం మీద ఆదాయము సుమారు4 లక్షల వరకు ఆదాయము వచ్చుచున్నది కనుక మాకు వారాంతరపు సొంత ఏర్పాటుకు స్థలాన్ని చూపించగల ర నీ విజ్ఞప్తి చేస్తున్నాను అశ్వాపురం తాసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన  శ్రీమతి బానోతు శారద అశ్వాపురం సర్పంచ్.