రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంచాల్ మండల గ్రామం బండలేముర్..

Published: Monday July 19, 2021
రంగా రెడ్డి, ప్రజాపాలన ప్రతినిధి : మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి బండలేముర్ గ్రామంలో వట్టి సోమయ్య, SK బాబు, వట్టి పెద్ద యాదయ్య ల ఇల్లు కూలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మంగ శ్రీనివాస్. ఇళ్లను పరిశీలించి ఆ కుటుంబలతో మాట్లాడి MRO మరియు RI లకు సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కుటుంబాలకు నష్టపరిహారం కింద 50,000 రూపాయలు మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను శాంక్షన్ చేయాలని సర్పంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కారో బారు పాల్గొనడం జరిగింది.