కెరెల్లి గ్రామంలో గ్రామ దేవతల ప్రతిష్ఠాపన

Published: Monday May 09, 2022
సర్పంచ్ కొత్తపల్లి నర్సింహారెడ్డి
వికారాబాద్ బ్యూరో 08 మే ప్రజాపాలన : కెరెల్లి గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో గ్రామ దేవతల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించామని గ్రామ సర్పంచ్ కొత్తపల్లి నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం ధారూర్ మండల పరిధిలోని కెరెల్లి గ్రామంలో గ్రామ దేవతల ప్రతిష్ఠాపన కార్యక్రమం గ్రామ సర్పంచ్ కొత్తపల్లి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలు, వికారాబాద్ మార్కెట్ మాజీ చైర్మన్ సామ రాంచంద్రారెడ్డిలు హాజరయ్యారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ వారి స్వగ్రామమైన కేరెల్లిలో గ్రామ సర్పంచ్ దంపతులు, గ్రామదేవతలు మైసమ్మ, పోచమ్మ, ఊరడమ్మ, రుక్కమ్మ, గాలి పోచమ్మ, గ్రామ నాభిశిల మరియు నాగ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎంపీపీ విజయ లక్ష్మి హన్మంత్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.