అంబులెన్స్ యాజమాన్యాల ఆగడాలు అడ్డుకోండి

Published: Wednesday May 05, 2021

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రత్యక్ష నరకం చూపిస్తున్న అంబులెన్స్ యాజమాన్యాలు
నిమిషాల చొప్పున వేల రూపాయల వసూళ్లు వారి ఆగడాలను అరికట్టాలని  యండిఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మధు డిమాండ్

పటాన్చేర్, మే 4, ప్రజాపాలన ప్రతినిధి : ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న కోవిడ్ రోగుల పట్ల అంబులెన్సులు యాజమాన్యాలు వ్యవహరిస్తున్న వైఖరి పట్ల యండిఆర్ ఫౌండేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాణాపాయ పరిస్థితుల్లో మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లేందుకు రోగులు ఆంబులెన్స్ లను ఆశ్రయిస్తే నిమిషాలకు వేల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు, అంబులెన్స్ యాజమాన్యాలు సిండికేట్ గా ఏర్పడి రోగుల పట్ల యమదూతల వ్యవహరించడం సిగ్గుచేటు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు.