ఆన్ లైన్ విద్యార్థుల అవస్థలు

Published: Tuesday June 29, 2021
తార్నాక, జూన్ 28, ప్రజాపాలన ప్రతినిధి : మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ నెట్ వర్కు వెలపల ఉన్నది. 198,1500 కస్టమర్ కేర్ కు డయల్ చేస్తే గత కొన్ని రోజులుగా బి.యస్ యన్.ఎల్. నెట్ వర్క్ పరిస్థితి ఇది. కరోనా మూలంగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నవి. అందుబాటులో ఉన్న వివిధ నెట్ వర్క్ లు ఉపయోగిస్తున్నారు. బి.యస్ యన్.ఎల్. బ్రాడ్ బ్యాండ్ తో ఆన్ లైన్ క్లాసులు వినే విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నెట్ డిస్ కనెక్టు అయినాక తిరిగి కనెక్టు అయితే వాల్లను వెయిటింగ్ రూంలో ఉంచడడం జరుగుతుంది. దీని వల్ల ఉపాధ్యాయుడు ఆన్ లైన్ లో చెప్పేది వినలేక ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొద్దిరోజులుగా తార్నాక పరిధిలోని ఎక్ చెయింజ్ పరిస్థితి ఇది. వేలకు వేలు ఫీజులు కట్టి నెట్ వర్క్ కారణంగా ఆన్ లైన్ క్లాసులు వినలేక పోతున్నారని తల్లి దండ్రులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పంధించి సమస్యను పూరించాలని నెట్ వర్క్ లొ అంతరాయం లేకుండా చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.