నిరుపేదకు కృత్రిమ చేతుల అందజేత

Published: Saturday December 31, 2022

జగిత్యాల, డిసెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలo అల్లీ పూర్ గ్రామానికీ చెందిన నిరుపేద  మొహమ్మద్ అషు ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్  గ్రామాల్లో కరెంట్ కు సంబంధించిన  ఎలక్ట్రిసిటీ సమస్యల్ని  తీర్చేవాడు. కానీ దురదష్టవశాత్తూ విద్యుదాఘాతంతో ఆతని రెండు చేతులు కోల్పోయినాడు. ఊరి ప్రజలు వారికి తోచిన ఆర్థిక సహాయం అందిస్తున్నప్పటికీ  కృత్రిమ చేతులకొరకు ఎందర్నో వేడుకున్నాడు.  విషయం తెలుసుకున్న ఎలుగందులు శ్రీనివాస్, ఎలిగేటి కిరణ్ కుమార్ లు మొహమ్మద్ అషుకు ఎలాగైనా సహాయం అందించాలనుకున్నారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న  స్నేహితుడు పుట్ట రవికాంత్ మరియు హైదరాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న బెంద్రం  రాంరెడ్డి, ఉప్పుగండ్ల ఆనంద్ ల సహకారంతో  మొహమ్మద్ అషు కు ఖరీదయిన మయో ఎలక్ట్రిక్  చేతులను  అందించి అతని కుటుంబంలో ఆనందాన్ని నింపారు. అంతేకాకుండా  ఇలాంటి సేవా కార్యక్రమాలకు నిరుపేదలకు తమవంతు సాయం చేస్తామని పత్రికా సమక్షంలో ఎలుగందులు శ్రీనివాస్, ఎలిగేటి కిరణ్ కుమార్ లు తెలిపారు. నిరుపేదలై ఉండి కృత్రిమ చేతులు కాళ్లు అవసరము ఉన్నట్లయితే  9849581758, 9949116659 ఫోన్ నంబర్ ను సంప్రదించమని తెలిపారు.