గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

Published: Saturday August 27, 2022
 ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి 
మేడిపల్లి, ఆగస్టు26 (ప్రజాపాలన ప్రతినిధి)
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్ల, చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వివిధ శాఖల అధికారులకు సూచించారు. ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అధ్యక్షతన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్ల, చర్యలు చేపట్టాలని వివిధ శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈనెల 31వ తేదీ నుంచి జరిగే ఉత్సవాల నిర్వహణకు భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఆయా శాఖల అధికారులకు సూచించారు.  విద్యుత్, తాగునీటి సదుపాయం పరిసరాల పరిశుభ్రత, పోలీస్ శాఖ వారి అనుమతి, రహదారులలో ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా చూడాలని , ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కక్కిరేణి చేతన హరీష్, బండారు శ్రీవాణి వెంకటరావు, ఉప్పల్ ఈఈ నాగేందర్, జలమండలి మేనేజర్ జాన్ షరీఫ్, ఉప్పల్ సిఐ గోవిందరెడ్డి, ట్రాఫిక్ సిఐ పార్థసారథి, విద్యుత్ శాఖ ఏ డి ఈ బాలకృష్ణ, ఏ ఏం సి కుమార్, ఎస్ డబ్ల్యూ డి ఈ చందన,శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్, ఎలక్ట్రికల్ ఏఈలు ,జిహెచ్ఎంసి ఎఇలు, విద్యుత్ అధికారులు హార్టికల్చర్ అధికారులు, వినాయక మండపాల ఏర్పాట్ల నిర్వాహకులు, టిఆర్ఎస్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, బన్నల ప్రవీణ్ ముదిరాజ్, గరిక సుధాకర్, పల్లె నర్సింగరావు కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area