ప్రజలను దోచుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

Published: Friday June 25, 2021
బోనకల్లు, 24, ప్రజాపాలన ప్రతినిధి : పెట్రోల్ డీజిల్ ధరలు పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్న ఈయనే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ  సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఆరోపించారు.. బోనకల్ మండల కేంద్రంలో పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చెయ్యాలని, కరోనను ఆరోగ్య శ్రీ లో చేర్చలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 13ను రద్దు చెయ్యలని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. భారతదేశానికి పెట్రోలు లభించే రేటు కన్నా రెండు రెట్లు పన్నులు రూపంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరు రూపాయల పెట్రోల్ రేటు పెరిగినందుకే అప్పటి ప్రధానికి ప్రస్తుత కేంద్రమంత్రి అయిన స్ముతి ఇరానీ గాజులు, బొట్టు  పంపించారనీ  అప్పడు  క్రూడాయిల్ ధర 150 డాలర్లుగా ఉంటే ప్రస్తుత క్రూడాయిల్ ధర 56 డాలర్లుగా ఉందని, అప్పటి రేటుతో పోల్చుకుంటే ఇప్పుడు పెట్రోల్ ధర కనీసం 35 నుంచి 45 రూపాయలు మాత్రమే ఉండాలని కానీ 100 రూపాయలు దాటినా స్ముతి ఇరానీ ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి  ప్రతి వస్తువు రేటు పెరుగుతూ పోతుంది తప్ప ఏ వస్తువు కూడా రేటు తగ్గడం లేదన్నారు. పెట్రోల్ రేటు విషయంలో కూడా అంతర్జాతీయ స్థాయిలో రేట్లు తగ్గినప్పుడు తగ్గుతాయని, రేట్లు పెరిగినప్పుడు పెరుగుతాయని  చెప్పారని  కానీ  గత ఏడు సంవత్సరాలుగా పెట్రోల్ రేటు పెరుగుతూనే ఉంది తప్ప ఒక్కసారి కూడా తగ్గలేదని  అందుకు గల కారణాలు ఏంటో ప్రజలకు తెలియ చెప్పాలన్నారు. బీజేపీ నాయకులు తమ ఉపన్యాసాలలో  ఇజ్రాయిల్ కు 40 వేల కోట్ల రూపాయల అప్పు తీర్చామని గొప్పలు చెబుతున్నారని, కానీ 40 వేల కోట్ల రూపాయల పేరు చెప్పి ఇప్పటికీ ప్రజల దగ్గర నుంచి 8లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేశారని ఆయన తెలియచెప్పారు. ఇరాన్ కు ఉన్న అప్పు తీరినా, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయిల్ రేటు కనిష్ఠ స్థాయికి పడిపోయినా,  భారతదేశంలో మాత్రం పెట్రోలు డీజిల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయని, దీనిని బట్టి చూస్తే మోడీ ప్రభుత్వం  ప్రజల్లో దోచుకోవడమే తప్ప ప్రజలకు చేసిన ఉపకారము ఏ మాత్రం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గితే నిత్యవసర వస్తువుల ధరలు కూడా అదుపులోకి వస్తాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు ఇప్పటికైనా ప్రేమ ఉంటే వెనువెంటనే కేరళ ప్రభుత్వ మాదిరిగా పెట్రోల్ డీజిల్ మీద వేసే పన్నులను తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సమితి సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, సీపీఎం బోనకల్ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, రవినూతల ఎంపీటీసీ కందిమల్ల రాధా, రామాపురం ఎంపీటీసీ ముక్కపటి అప్పారావు, మాజీ ఎంపీపీ తుళ్ళూరి రమేష్, మాజీ జడ్పీటీసీ కొమ్ము శ్రీను, సీపీఎం నాయకులు తెల్లకుల శ్రీనివాసరావు, భూక్య జాలు, చేన్నా లక్ష్యద్రి, ఉమ్మినేని రవి, పాపినేని అప్పారావు,సాదం శ్రీను, గద్దె రామారావు, రాజు కార్మిక నాయకులు బోయినపల్లి వీరబాబు, ఏసుపోగు బాబు, సాధినేని మల్లికార్జున రావు, ఉప్పారా శ్రీను, బిల్లా విశ్వనాధం, తదితరులు పాల్గొన్నారు.