రెండో రోజు చేరిన అఖిలపక్షం పార్టీల రిలే నిరాహారదీక్ష

Published: Wednesday June 30, 2021
మధిర, జూన్ 29, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర ప్రభుత్వ  ఆసుపత్రిలో వైద్యుల పోస్ట్లు భర్తీ చేయా లని కోరుతూ అఖిలపక్షం పార్టీల ఆధ్వర్యంలో రెండో రోజు కు చేరిన రిలే నిరాహార దీక్ష, ఈ దీక్షలో కూర్చున్న వారు కాంగ్రెస్ పార్టీ నుంచి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్, టీడీపి పార్టీ నుంచి గద్దం మల్లికార్జునరావు, పగిడిపల్లి కాసిరావు, సీపీఐ పార్టీ నుంచి పున్నవేల్లి అప్పారావు, కొండూరు నాగేశ్వరరావు, ఈ దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన వారు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం గారు, టీడీపీ మండల అధ్యక్షుడు మర్నిడు పుల్లారావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ నుంచి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మిరియాల రమణ గుప్తా, మున్సిపల్ కౌన్సిలర్లు మునుగోటి, కోన ధనికుమార్వెంకటేశ్వరరావు, సీపీఐ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బెజవాడ రవి బాబు, సీపీఐ మండల సెక్రటరీ ఉట్ల కొండల్ రావు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి చావా మురళి కృష్ణ, బీజేపీ పార్టీ నుంచి రామిశెట్టి నాగేశ్వరరావు, దీక్ష ను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ.ప్రభుత్వ హాస్పటల్ లో వెంటనే డాక్టర్లు ను నియమించాలి అని, 30 పడకల ఆసుపత్రి ని 100 పడకల ఆసుపత్రి గా మార్చారు కానీ ఆ స్తాయి లో డాక్టర్స్ ని కానీ పరికరాలు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం చాలా విడ్డురం అన్నారు... ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల sc సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు మైనార్టీ నాయకులు షైక్ జహంగీర్, మొహమ్మద్ అలీ, ఆదిములం శ్రీనివాస్, సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు అన్నవరం సత్యనారాయణ, టీడీపి కౌన్సిలరు విరమచినేని శ్రీనివాసరావు, మైనీడు జగన్, మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు..