*ఇంటింటికి సిపిఐ* -ప్రజా పోరు యాత్ర గోడపత్రిక విడుదల. -మోడీ నిజం కోసం పాలనకు వ్యతిరేకంగా. -రాష్

Published: Monday April 10, 2023

చేవెళ్ల ఏప్రిల్ 9, (ప్రజాపాలన):-

మోడీ నిరంకుశ పాలనకు ప్రాలదొలి, ప్రగతిశీల లౌకిక ప్రజాస్వామ్యంతో కూడిన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని రామస్వామి అన్నారు.
ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో  ఏప్రిల్ 14 నుండి మే 15 వరకు ఇంటింటికి సిపిఐ  గోడపత్రికను జిల్లా కార్యవర్గ సభ్యులు రామస్వామి ముఖ్య అతిథులుగా హాజరై విడుదల చేశారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ (బిజెపి కో హటో దేశ్ కో బచావో )పేరుతో దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రధాని మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వ విధానాల వలన దేశంలో వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను దేశ సమైక్యత సమగ్రతకు వాటిల్లే ప్రమాదాలను ప్రజలకు వివరించడం పాటు ప్రమాదకర ఫాసిస్టు నిరంకుశ హిట్లర్ తరహా పాలలను అందిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఓడించి వామపక్ష ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులతో కూడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలను చైతన్యపరిచే పాదయాత్రలను ప్రజా పోరు యాత్రలను వివిధ రూపాల్లో చేపట్టి ప్రతి గ్రామము సందర్శించాలని సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు అందరూ కార్యకర్తలు కూడా సంసిద్ధం కావాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ శ్రేణులతో పాటు అన్ని రకాల కార్మిక వర్గం రైతులు కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రబలింగం కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. సుభాన్ రెడ్డి ఏఐటీయూసీ జిల్లా  కార్యదర్శి వడ్ల సత్యనారాయణ మండల పార్టీ కార్యదర్శి మల్ గారి సత్తిరెడ్డి సహాయ కార్యదర్శి ఎం డి మక్బుల్ బి కే యం యు జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ గీత పనివాళ్ల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్  ఏఐటియుసి మండల అధ్యక్షుడు శివ ప్రధాన కార్యదర్శి డప్పు శివయ్య ఒగ్గు సత్యనారాయణ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల మాధవి విజయమ్మ సాయిలమ్మ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.