ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్ ను జయప్రదం చేయండి

Published: Wednesday September 22, 2021
ఏ ఐ సి టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణ
బెల్లంపల్లి, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : దేశంలోని అన్ని వర్గాల ప్రజలపై ఉక్కుపాదం మోపుతూ ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న జరుగు భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఏ ఐ సి టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలపై ఉక్కుపాదం మోపుతూ, ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తూ సింగరేణి, రైల్వే, విద్యుత్, విమానాశ్రయాలు, ఎల్ఐసి, బ్యాంకింగ్, ఆర్టీసీ, వంటి సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి, ఎన్నో పరిశ్రమలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలని, చూస్తున్న ఈ ప్రభుత్వాలకు వేరే గంగా పోరాడాలని అని ఆయన అన్నారు. ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలను దోచి పెట్టాలని కార్పొరేట్ ఘటన పేరుతో ప్రైవేటు వారికి అప్పగించాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ విధానాలను కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, కవులు, మహిళలు, యువకులు, తెలంగాణ రాష్ట్రంలోని 19 రాజకీయ పార్టీలు,వాటి  యూనియన్లు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే ఈ పద్ధతులను విరమించుకోవాలని కోరుతూ ఈనెల 27 నాడు జరుగు భారత్ బంద్ లో పాల్గొనాలని కార్మికవర్గానికి, రైతాంగానికి, విద్యా, వ్యాపార, వాణిజ్య, స్వచ్ఛంద సంస్థలకు సింగరేణి కార్మికులకు మరియు అసంఘటిత కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సబ్బని రాజేంద్ర ప్రసాద్, కొండ శ్రీనివాస్, పసుపులేటి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.