పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు

Published: Saturday March 04, 2023
 
బోనకల్, మార్చి 3 ప్రజా పాలన ప్రతినిధి:కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ బోనకల్ మండల కార్యదర్శి యంగల ఆనందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2020 నుండి 2023 వరకు ప్రభుత్వం ఇప్పటికే ఆరుసార్లు గ్యాస్ ధరలు పెంచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఏ 2 ప్రభుత్వంలో కూడ అయినప్పటికీ గ్యాస్ ధర పెరగలేదని ప్రభుత్వమే ఆ నష్టాన్ని భరించిందన్నారు. 50 రూపాయల గ్యాస్ ధర పెరిగినందుకు బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ అప్పటి ప్రధానమంత్రి కి గాజులు చీరా పంపించారని కానీ ఇప్పుడు ఏకంగా 1116 రూపాయలు కు గ్యాస్ ధర పెరిగినప్పుడు ఆమె ఎక్కడున్నారని ఆయన విమర్శించారు. బిజెపి కార్పొరేట్ల ప్రభుత్వమే కానీ పేద ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదని ఆయన విమర్శించారు. మధ్యతరగతి ప్రజలను పేద ప్రజలుగా, పేద ప్రజలను నిరుపేదలుగా, నిరుపేదలను నిరాశ్రయులుగా చేసే పనిలో మోడీ ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . కార్పొరేట్ల ఆదాయం పెంచడానికి మోడీ ప్రభుత్వం పని చేస్తుందని అయన విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మహాతంగి శ్రీనివాసరావు, గుడిదే కృష్ణ, కలకోట మత్య సహకార సంఘం అధ్యక్షులు బాలుగురి అచ్చయ్య,యంగల కేరి, ఏఐఎస్ఎఫ్ నాయకులు యంగల ఉజ్వల చరణ్. మహిళా నాయకురాళ్ళూ యంగల కృష్ణవేణి, యంగల వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.