కరోనా బాధితులకు శానిటైజర్లు పి పి టికెట్లు పంపిణీ

Published: Wednesday May 19, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మంగళవారం కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా మన పులిగిల్ల గ్రామంలో కరోనా కేసులు పేరుగుత్తున్న కారణంగా వారికి ఎల్లప్పుడూ సేవలు అందిస్తూ వారికి మనోదైర్యం నింపి వారికి అత్యవసర సేవలు అందిస్తున్న గ్రామ ఆశావర్కర్లు అయిన  మమత, సుజాత, అచ్చమ్మ, ఏ.ఏన్.యం.లకు ఇతర గ్రామ సిబ్బందికి  పాలేర్ల నరసింహ బి.బి.ఆర్. హాస్పిటల్ తండ్రి రాజయ్య సతిమణీ స్వర్గీయ పాల్లేర్ల అంజమ్మ జ్ఞాపకార్థంతో గ్రామంలోని ఇతర కరోనా వైరస్ భాదితులకు శానిటైజర్స్, పీ.పీ.కిట్లు, గ్లౌజులు, డిజిటల్ ధర్మామీటర్లు, బిపి ఆపరేటింగ్ మిషన్లు, ఇతర టెలీ మెడిసిన్ కిట్లను గ్రామ గ్రామ పంచాయతీ పాలకవర్గం సమక్షంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా పాలేర్ల నరసింహ మాట్లాడుతూ గ్రామంలో అందరు బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిరుగుతుందని అన్నారు. అలాగే వడ్డెమాని మధుసూన్ మాట్లాడుతూ ఊర్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు మా దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వలిగోండ వైద్య అధికారులు సుమలత, గ్రామ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ సురేందర్ రెడ్డి, యం‌పిటిసి ఏల్లయ్య, ఉప సర్పంచ్ చంద్రయ్య, పంచాయతీ కారోబార్ పైళ్ళ గణపతి రెడ్డి, వార్డు సభ్యులు వేముల అమరేందర్, కళ్ళేంసుదర్శన్ రెడ్డి, వడ్డెమాని వెంకటయ్య, వాకిటి వేంకట్రెడ్డి, ఆలేటి సుధీర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.