ఆడ పిల్లలను ఎదగనిద్దాం.. చదవనిద్ధం..

Published: Tuesday January 25, 2022
జేయస్ ఎస్ డైరెక్టర్ రాధాకృష్ణ పిలుపు
తల్లాడ, జనవరి 24 (ప్రజాపాలన న్యూస్): జాతీయ బాలికల దినోత్సవ వేడుకలను సోమవారం జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం అర్బన్, ముస్తఫానగర్, ఖమ్మం పట్టణం, వివిధ గ్రామాలలో ఒకేషనల్ ట్రైనింగ్స్ నడపబడుతున్న జె యస్ యస్ సెంటర్స్ లో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా జేయస్ యస్ ఖమ్మంజిల్లా డైరెక్టర్ వై.రాధాకృష్ణ హాజరై కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లలను పుట్టానిద్దాం, ఎదగనిద్దాం, బ్రతకనిద్దాం మరియు చదవనిద్దామని ప్రతిజ్ఞ చేయించారు. ఆడపిల్ల అంటే శాపం కాదు వరంలా, బంగారంలా భావించి ఆదరించాలని సూచించారు. ప్రస్తుతం ఆడపిల్లలు అన్నిరంగాలలో ముందంజలోనే ఉన్నారన్నారు.శాస్త్రసాంకేతికంగా, వృత్తివిద్యా పరంగా, ఆర్థికంగా, సామజికంగా, రాజకీయంగా ఎంతగానో అభివృద్ధి పదంలో ముందున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జె యస్ యస్ స్టాఫ్ రిసోర్స్ పర్సన్స్ జాస్మిన్, రాధ ఖైరున్నిసా బేగం, వెంకటలక్ష్మి, వైష్ణవి ఎస్ కె రజియా, గ్రామ పంచాయత్ ప్రెసిడెంట్స్, సెక్రెటరీస్, ఆశా, అంగన్వాడీ, కస్తూర్బ స్కూల్స్ టీచర్స్, జె యస్ యస్ లబ్ధిదారులు పాల్గొన్నారు.