మధిర పట్టణ నూతన ఎస్ ఐ ఎస్ సతీష్ కుమార్ గారికి మధిర సేవా సమితి అభినందనలు

Published: Tuesday May 18, 2021

మధిర, మే17, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా శ్రీ సోమ సతీష్ కుమార్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మధిర సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు ప్రసాద్ రావు గారి సమక్షంలో చిరు సన్మానం చేసినారు ఈ సందర్భంగా ఎస్సై గారు మధిర సేవా సమితి సేవా కార్యక్రమాలను తెలుసుకొని అభినందించారు. మా వంతుగా మీ సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోమటిడి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు, కోశాధికారి యర్రా లక్ష్మణ్ పాల్గొన్నారు