రైతు వ్యతిరేక చట్టాలను నిలిపివేయాలని నిరసన

Published: Tuesday August 10, 2021

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 09 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో రైతు కార్మిక వ్యతిరేక వ్యవసాయ చట్టాలను లేబర్ కోడ్ లను ప్రజావ్యతిరేక విద్యుత్తు చట్ట సవరణలు ఆపాలని రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో, సి ఐ టి యు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఈ నరసింహ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని, గత ఎనిమిది నెలలుగా దేశంలో తీసుకు వచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని విరోచిత పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా కావడం లేదు, దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్య మానవుడు బతకలేని పరిస్థితిలో ఉన్నారు అని ఆయన అన్నారు, అంతేకాకుండా ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి దివాలా కోరుతనానికి బిజెపి ప్రభుత్వం దిగజారే రీతిలో అనుసరిస్తోంది, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు పోయి అనేక మంది యువకులు రోడ్డున పడుతున్నారు, కరోనా మహమ్మారి నుండి ఇ ప్రజలు రక్షించడంలో పూర్తిగా విఫలం చెందింది, అనేకమంది కరోనా బాధితులు వైద్యం అందక వెంటిలేటర్స్ ఆక్సిజన్ సరిపడా నిధులు లేకపోవడం వల్ల లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది, ప్రభుత్వ కంట్రోల్ లేకపోవడం వల్ల ప్రవేటు హాస్పిటల్స్ యాజమాన్యం కరోనా బారిన పడిన ప్రజ లనుండి, లక్షల కొద్ది రూపాయలు దండుకుని ప్రజలను పీడిస్తున్న ప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిఘటించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, భారత రక్షణ, దినంగా, పాటిం చాలని, మరో క్విట్ ఇండియా ఉద్యమాన్ని తల పెట్టే విధంగా అందరూ ఐక్యమత్యంతో పోరాటంలో రావాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ముత్యాలు ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు శివ, మల్లేషు, యాదయ్య పాల్గొన్నారు.