తెరాస యువ నాయకులు న్యాయవాది సంజీవ్ కుమార్

Published: Friday September 09, 2022

సంక్షేమ పథకాలలో దేశంలో నెంబర్ వన్ తెలంగాణ

వికారాబాద్ బ్యూరో 08 సెప్టెంబర్ ప్రజా పాలన : సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ అని తెరాస యువ నాయకులు న్యాయవాది పీలారం సంజీవ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సక్రమంగా సవ్యంగా పకడ్బందీగా అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ దూర దృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు సాగుకు ఇబ్బంది కలగకుండా 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కొనియాడారు. అభివృద్ధి పరంగా పక్కా ప్రణాళిక బద్ధంగా ఉచిత విద్యుత్ సంక్షేమ పథకాన్ని అమలు పరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే 24 గంటల రైతుల ఉచిత విద్యుత్ ఇస్తున్న మాదిరిగానే దేశంలో కూడా ప్రతి రైతుకు సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తానని హామీ ఇవ్వడం శుభపరిణామమని స్పష్టం చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రతి గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించడం నిదర్శనమని గుర్తు చేశారు. యంగ్ డైనమిక్ లీడర్ మన ఎమ్మెల్యే ఆనంద్ కావడం నియోజకవర్గం అభివృద్ధికి శుభ సూచకమని చెప్పారు. గతంలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా చేయలేని పనులను సైతం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ చేతల్లో చేసి చూపించడం ఆదర్శనీయంగా ఉందని తెలిపారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యేను అభినందించాల్సిన విషయమని కొనియాడారు. ప్రజా సమస్యల కొరకు ప్రజాక్షేత్రంలో తిరుగుతూ మీతో నేను పల్లెనిద్ర గులాబీ అండ వంటి కార్యక్రమాలతో ప్రజలను రంజింప చేస్తున్నాడని గుర్తు చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆనంద్ అభినందనీయుడని ప్రశంసించారు.