*శిశువుల తారుమారు వీడిన చిక్కుముడి* డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా శిశువుల అప్పగింత

Published: Wednesday January 04, 2023
మంచిర్యాల టౌన్, జనవరి 03,ప్రజాపాలన : 
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు  శిశువుల అప్పగింతలో తలెత్తిన చిక్కుముడి వీడిపోయింది.  మంగళవారం  ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యం లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎన్‌ఏ పరీక్షల రిపోర్టు ఆధారంగా ఆయా  కుటుంబాలకు శిషువుల ను అప్పగించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి  మాట్లాడుతూ 
బాలింతకు తన బిడ్డను కాకుండా మరో శిశువును ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడిన ఘటన మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో  డిసెంబర్ 27 మంగళవారం రాత్రి చోటుచేసుకుందని తెలిపారు. ఇదిలావుండగా, కోటపల్లి  మండలం రొయ్యల పల్లి కి చెందిన  దుర్గం మమత రమేష్ లు ప్రసవం కోసం ఇటీవల ఆసుపత్రికి రాగా విధుల్లో ఉన్న వైద్యురాలు   శస్త్రచికిత్స చేసింది. కొద్ది నిమిషాల తేడాతో మరో గర్భిణికి బొల్లం పావని సాయి కుమార్ లు సైతం చేయగా ఒకరికి ఆడ, మరొకరికి మగ బిడ్డ జన్మించారు. ఆడ శిశువును ఇవ్వాల్సిన   రొయ్యల పల్లి బాధిత బంధువులకు మగ శిశువును ఇవ్వడంతో ఆందోళన మొదలైంది. బాధిత కుటుంబసభ్యులను సముదాయించినా వినకపోవడం వారు మగశిశువును ఇవ్వకపోవడంతో ఆసుపత్రిలో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. చివరకు బాధిత తల్లి తనకు ఆడ శిశువే జన్మించింది అని చెప్పినా నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నించారు. వైద్యురాలిని వివరణ కోరగా సిబ్బందికి వివరాలు తెలిపి సరిగ్గానే శిశువును ఇచ్చి పంపించానని, వారి తొందరపాటుతో ఇలా జరిగిందంటూ చెప్పారు. తల్లికి ముందే శిశువును చూపించినట్లు తెలిపారు. ఆమె సానుకూలంగా ఉన్నా కుటుంబసభ్యులు ఇబ్బంది పెడుతున్నారంటూ వివరించారు. కాగా ఆసుపత్రి పర్యవేక్షణాధికారి హరిశ్చంద్రా రెడ్డి, జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి, డి సి పి అఖిల్ మహాజన్ సూచనల మేరకు  పూర్తి నిర్ధారణ అయ్యే వరకు ఇద్దరిని శిశువులను శిశు సంక్షేమశాఖకు అప్పగించి డీఎన్‌ఏ పరీక్షల కోసం తల్లి, శిశువుల రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ కు నిర్ధారణ కొరకు పంపగా మంగళవారం రోజున డి ఎన్ ఎ రిపోర్టు రావడం తో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, డి సి పి, తల్లిదండ్రుల సమక్షంలో  సీల్డ్ కవర్ లో ని రిపోర్టు తెరచి సూచీ అనంతరం దుర్గం మమత రమేష్ దంపతులకు పుట్టిన ఆడ శిశువును, బొల్లం పావని  సాయి కుమార్  దంపతులకు పుట్టిన మగ శిశువును అప్పగించారు. దీనితో వారం రోజుల ఉత్కంఠకు తెరపడింది.