కామారెడ్డిగూడలో సిసి రోడ్డు నిర్మాణం

Published: Tuesday March 14, 2023
* సర్పంచ్ సామల పురుషోత్తంరెడ్డి
వికారాబాద్ బ్యూరో 13 మార్చి ప్రజాపాలన : కామారెడ్డిగూడ  గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని సర్పంచ్ సామల పురుషోత్తం రెడ్డి అన్నారు. వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గూడలో ఎంఎన్ఆర్ఇజిఎస్ 15 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టామని వివరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ సంగారెడ్డి ఇంటి నుండి స్మశానవాటిక వరకు సిసి రోడ్డు నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. 26 మీటర్లకు లక్ష రూపాయల నిధుల చొప్పున 15 లక్షలకు సంబంధించిన సిసి రోడ్డు నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు. 5 లక్షల నియోజకవర్గ అభివృద్ధి పనుల నిధులతో అండర్ డ్రైనేజ్ నిర్మాణం పనులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. త్వరలో అండర్ డ్రైనేజీ నిర్మాణం పనులు ప్రారంభిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. అండర్ డ్రైనేజీ పనులను  చాకలి పుల్లయ్య ఇంటి నుండి నల్లబక్కారెడ్డి ఇంటి వరకు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి,
సెక్రటరీ శిల్ప, ఫీల్ఢ్ అసిస్టెంట్ సుధాకర్,
పారిశుద్ధ్య కార్మికుడు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.