సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తొలిమెట్టు బోధనోపకరణాల మేలకి ముఖ్యఅతిథిగా పాల్గొన్న బూర

Published: Wednesday January 04, 2023
బూర్గంపాడు (ప్రజా పాలన.)
 
ఈరోజు సావిత్రి బాయి పూలె  జయంతి సందర్బంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రాంగణం ఎంపీపీ ఎస్  బూర్గంపహాడ్ లో ఏర్పాటు చేసిన మండల స్థాయి
బోధనోపకరణాల మేళా కి ముఖ్యఅతిథిగా హాజరైన బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
ఈ సందర్బంగా బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత  మాట్లాడుతూ సమాజంలో అసమానత మీద అలుపెరుగని పోరాటం చేసి, మహిళా హక్కుల కోసం, ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి, సమాజంలో రుగ్మతాలను రూపుమాపడానికి విశేష  కృషిచేసిన సామాజిక ఉద్యమ మూర్తి, సావిత్రి బాయి పూలే అని వారు అన్నారు. సావిత్రిబాయి పూలే  జయంతి సందర్భంగా వారికి   ఘన నివాళులు అర్పించారు., అలాగే ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదడ్డాడానికి ఎల్లప్పుడూ తోర్పడుతూ ఉంటారని తెలియజేశారు. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత  సాధించటానికి ఉపాధ్యాయులు విద్యార్థులకు కావలిసిన సహాయం సహకారాలను అందించాలని సూచించారు.
పిల్లలకి  ఎలా చదువు చెపితే అర్థమవుతుందో ఉపాధ్యాయులు తయారు చేసిన  పరికరాలను చూసి  అన్ని సబ్జక్ట్స్ గురించి తెలుసుకున్నారు., ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న , ఎంఈఓ  సమ్మయ్య , జిల్లా కోర్డినేటర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు సుమతి, బూర్గంపహాడ్ మండల ప్రైమరి స్కూల్  ఉపాధ్యాయుని ఉపాధ్యాయలు,విద్యార్థుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు