దళిత బంధులో మాలలకు అన్యాయం... మంత్రి పదవికి కొప్పుల ఈశ్వర్ రాజీనామా చేయాలి, మాల మహానాడు రాష్

Published: Monday September 12, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 11 ప్రజా పాలన ప్రతినిధి: దళితుల కోసం ఏర్పాటుచేసిన దళిత బంధు పథకం దళితుల్లో ఒక వర్గం అయినా మాలలకు అందడం లేదని అన్యాయం జరిగిందని దీనికి బాధ్యత వహిస్తూ, మాల సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంటనే రాజీనామా చేయాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కాసర్ల యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక
 బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు . తెలంగాణ రాష్ట్రంలో 36,000 దళిత బంధు యూనిట్లు విడుదల చేస్తే అందులో మాలలకు కనీసం ఒక 5,000 యూనిట్లు కూడా ఇవ్వలేదని, బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన సామాజిక వర్గానికి( నేతకాని) చెందిన 90 మందికి దళిత బంధు ఇప్పించుకు న్నారని అన్నారు.  మాలలకు మాత్రం తూ తూ మంత్రంగా కేవలం  ఐదు యూనిట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఒక దళిత ఎమ్మెల్యే అయి కూడా దళితుల పట్ల వివక్ష చూపుతున్నాడని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారని అందులో 50 శాతం దళిత బంధు యూనిట్లు మాలలకు కల్పించాలన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వారు అయి ఉండి కూడా మాలలను పట్టించుకోవడం లేదని, ఇలాంటి మంత్రి రాష్ట్రానికి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని, తక్షణమే కొప్పుల ఈశ్వర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2005 లో చంద్రబాబు నాయుడు మాలలను చిన్న చూపు చూస్తే ఓటుతో బుద్ధి చెప్పి సాగనంపడం జరిగిందని ఈ విషయాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా  గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సబ్బని రాజనర్సు, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు దాసరి జయ, ఉపాధ్యక్షురాలు భోగే రజిని, ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షుడు గుర్రం ప్రదీప్, జిల్లా నాయకులు భోగే మధు, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు కొప్పుల రవలి, బెల్లంపల్లి నాయకులు శ్రావణ్ కుమార్, రాజేశ్వరి, సోనీ, కమల తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area