రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు టీఆరెఎస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.... --జెడ్పీ చైర్

Published: Thursday November 03, 2022

జగిత్యాల, నవంబర్, 02 ( ప్రజాపాలన ప్రతినిధి): రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు టీఆరెఎస్  ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జెడ్పీ చైర్ పర్సన్ అన్నారు. కథలపూర్ మండలంలో అంబారిపెట్, తుర్థీ, తాండ్రియాల్, గంబిర్ పూర్, బొమ్మెన గ్రామాలలో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  మరియు ఐకేపీ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను  జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ ఛైర్మెన్ లోక బాపురెడ్డి ప్రారంభించినారు. ఈ సందర్భంగా  చైర్ పర్సన్ మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతే రాజుగా చూడాలని వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చారని అన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఈఓ మరియు డిసిఓ రామానుజనాచార్యులు డిఆర్డిఓ వినోద్ జడ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి, మార్కెట్ కమిటీ చైర్మన్ వర్దినేని నాగేశ్వర్ రావు, వైస్ ఎంపిపి కిరణ్ రావు, ప్యాక్స్ చైర్మన్ లు దేవరజం, దాసరి గంగధర్, పార్టీ అధ్యక్షుడు గంగ ప్రసాద్  ప్యాక్స్ వైస్ చైర్మన్స్ మిట్టపెల్లి లక్ష్మీ గంగ రెడ్డి, శీలం మోహన్ రెడ్డి, సర్పంచులు గోపు శ్రీనివాస్, కొలకాని శేఖర్, పోతు సింధూజ రాజా శేఖర్, పిడుగు లావణ్య తిరుపతి, జిల్లా రైతు సమితి సభ్యులు చిటి విద్యసాగర్ రావు, గుండారపు గంగధర్, రైతులు మహిళా సంఘ సభ్యులు అధికారులు నాయకులు పాల్గొన్నారు.