అంగన్వాడి సెంటర్ లో పుట్టినరోజు వేడుకలు

Published: Monday March 28, 2022
భద్రాద్రి కొత్త గూడెం బ్యూరో(ప్రజాపాలన)భద్రాచలం టీ అర్ ఎస్ యూత్ సెక్రెటరీ ఆకుల వెంకట్ పుట్టిన రోజు సందర్భంగా భద్రాచలంలోని అంగన్వాడీ సెంటర్ లో పిల్లల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ముందుగా పిల్లల మధ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం పిల్లలకు భోజనం పెట్టించి,సెంటర్ కు టేబుల్, కుర్చీలు, పిల్లలు భోజనం చేయడానికి ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ పుట్టినరోజు వేడుకను అంగన్వాడి సెంటర్ లో పిల్లల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆకుల వెంకట్ అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల కార్యదర్శి కొండిసెట్టీ కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, నాయకులు చింతాడి చిట్టిబాబు, బల్లా రాంబాబు, రాజీవ్, విజయ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు