విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Thursday September 08, 2022

ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 07 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో, కళాశాలల విద్యార్థుల ఆరోగ్యం పట్ల సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి తో కలిసి గురుకుల పాఠశాలల, కళాశాలల, ప్రధానోపాధ్యాయులతో విద్యార్థుల ఆరోగ్యం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. గతంలో గిరిజన, షెడ్యూల్డ్ కులాల, కేజీబీవీ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్య చిట్టి గతులపై పర్యవేక్షణ ఉన్నప్పటికీ విద్యార్థుల మరణం సంభవించడం బాధాకరమని, ఇకపై ఇలాంటి చర్యలు పునరావృతం అయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వసతి గృహాలలో పరిశుభ్రత, విద్యార్థులకు మెనూ ప్రకారం గా పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, సంబంధిత జిల్లా అధికారులు వసతి గృహాలను సందర్శించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు జరిపి నివేదిక ను రెండు రోజులలో అందించాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థులకు ఆరోగ్య స్థితి ఉన్నట్లయితే వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్ళి వైద్య సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభాకర్, జిల్లా విద్యాధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.