వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు

Published: Tuesday May 04, 2021
పరిగి, 03 మే ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, పరిగి మండల పరిధిలోని కళాపూర్ లొంక హనుమాన్ దేవాలయం సమీపంలో మిషన్ భగీరథ పైపు పైకప్పు పగిలి నీరు వృధాగా పోతుంది. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. కానీ మిషన్ భగీరథ మెయిన్ పైపు లైన్ పగిలిపోవడంతో వచ్చే నీరు ప్రజల నివాసాల్లోకి వెళ్లక ముందే నేల పాలవుతుంది. లైన్ మెయిన్ సిబ్బంది వల్లనే ఈ సమస్యలు వెలువెత్తునాయని కొందరు అన్నుకుంటున్నారు. చాలా గ్రామాల్లో నీరులేక ప్రజలు అలమటిస్తుంటే మధ్యలోనే నీరు నేలపాలవుతుంటే ఉపయోగమేమిటని ప్రజలు అంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి అంటున్నారు.