మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వరల్డ్ ట్రామా డే పై అవగాహన కార్యక్రమం... హైదరాబాద్ (ప్రజాపాల

Published: Tuesday October 18, 2022
వరల్డ్ ట్రామా డే పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల సహకారంతో సోమాజిగూడ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోడ్ యాక్సిడెంట్స్ పై ప్రజల్లో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా పంజాగుట్ట ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్   PG రెడ్డి, అమీర్ పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి,పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా అత్యవసర సమయంలో వైద్య సహాయం అవసరమయ్యే  రోగులకు సత్వర ప్రధమ చికిత్స ఎలా అందించాలో  మెడికవర్ హాస్పిటల్స్, అత్యవసర విభాగం డాక్టర్స్ ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథి గా పాల్గొన్న గచ్చిబౌలి ట్రాఫిక్ CI శ్రీనాథ్  మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి అని గణాంకాలు చెబుతున్నాయని,మితిమీరిన వేగం , హెల్మెట్ లేకపోవడం , సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి కారణాలతో చాల మంది రోడ్ ప్రమాదాల్లో వారి ప్రాణాలను అర్దాంతరంగా పోగొట్టుకుంటున్నారు అని అన్నారు.Ex- కార్పొరేటర్ శశికుమారి మాట్లాడుతూ
90 శాతం మరణాలకు సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడమే ప్రధాన కారణం అన్నారు. ప్రతి ఒక్కరి జీవితం చాలా విలువైనదని, మన అందరం సరైన భద్రతా ప్రమాణాలు పాటించి ఇతరులకు అవగాహనా కల్పించాలి అని అన్నారు.అనంతరం ఆర్థోపెడిక్స్ డాక్టర్ సుమన్ బైనిక్  మాట్లాడుతూ
దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా  ప్రతిరోజూ 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నట్లు గాయాలు మరియు మరణాలను తగ్గించడానికి వరల్డ్ ట్రామా డే జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. "తగిన వైద్య  సమాచారం లేకుండా , రోగులు ఉన్నట్టుండి అత్యవసర స్థితిలో తమ విభాగానికి వస్తారని, ట్రామా (గాయాన్ని) తీవ్రతను అన్నికోణాల్లో విశ్లేషించి తక్షణమే మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడడం అనేది సవాలుతో కూడుకున్న విషయమైనప్పటికీ మా బృందం సత్వర చికిత్సనందించడంలో నిమగ్నమైవుంటుందని అయన అన్నారు.24 గంటలూ అనుభవజ్ఞులైన డాక్టర్లు, లెవల్ 1 అడ్వాన్స్‌డ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ సెంటర్‌ ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యపడుతున్నాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో సెంటర్ డాక్టర్ రుషికేశ్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.