కొలం లింబుగూడాలో సమేల భీమయ్య చట్టి వార్షికోత్సవం ** వాంకిడి జెడ్పిటిసి అజయ్ కుమార్ **

Published: Tuesday December 27, 2022

 ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి) : జిల్లాలోని వాంకిడి మండలం ఖీరిడి గ్రామపంచాయతీ పరిధిలో గల కొలం లింబుగూడ గ్రామంలో శక్తి రూపుడై వేలసిన సమెల భీమయ్య చట్టి వార్షికోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వాంకిడి మండల జడ్పిటిసి డాక్టర్ అజయ్ కుమార్ పార్టీ సమేతంగా హాజరయ్యి దర్శనం తీసుకున్నారు. ఈ సందర్భంలో సమేల భీమయ్య స్వామి దగ్గర షెడ్, బోర్వెల్ కావాలని కొలం సంఘ ఉపాధ్యక్షులు ఆత్రం జల్పత్ రావు, గ్రామస్తులు చర్చించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి డా"అజయ్ కుమార్. సమెలా భీమయ్య ఆలయ అభివృద్ధి పనులు తప్పకుండా చేద్దాం అని గ్రామ ప్రజలకు  హామీ ఇచ్చారు.అనంతరం గ్రామ భక్తులతో గుడి ఆలయ ప్రాంగణంలో జెడ్పిటిసీ అజయ్ కుమార్ ప్రజలతో పార్టీ నాయకులు,సర్పంచులతో సామాన్య వ్యక్తిగా ఆదివాసీ సంస్కృతిక నృత్య స్టెప్పులతో అలరిస్తూ చిందులేశారు. ఈ కార్యక్రమంలో దుర్గం కమలాకర్, సరండి సర్పంచ్,  డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్,  టిఆర్ఎస్ నాయకులు అనపర్తి  సదాశివ్, వినోద్, లు పాల్గొన్నారు.