ఆరోగ్య లక్ష్మీ కమిటీ నియామకం...

Published: Thursday October 28, 2021

బీరుపూర్, అక్టోబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : బీరుపూర్ మండల్ రేకులపల్లి గ్రామంలో ఆరోగ్య లక్ష్మీ కమిటీని నియమించారు. స్థానిక అంగన్వాడీ కేంద్రం 2లో సర్పంచ్ ఎలగందుల లక్ష్మి పర్యవేక్షణలో అంగన్వాడీ టీచర్ సుమలత ఆశ వర్కర్ మరియు బాలింతలు సమావేశమై ఆరోగ్య లక్ష్మి కమిటీని ఏర్పచుకున్నారు. కమిటీ ఛైర్మన్ గా సర్పంచ్ ఎలగందుల లక్ష్మి సభ్యులుగా సువర్ణదీప ఆశావర్కర్స్ గంధం ఐశ్వర్య గోదావరి శ్యామల టి.శ్రీకాంత్ (టీచర్) జాడి మల్లవ్వను నియమించారు. కిశోర బాలికగా నేతుల మధులతను కూడ కమిటీలోకి తీసుకున్నారు.