రబీ కూరగాయల సాగులో సస్యరక్షణ

Published: Friday February 10, 2023
* కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఎ. క్రిష్ణా రెడ్డి 
వికారాబాద్ బ్యూరో 9 ఫిబ్రవరి ప్రజాపాలన : రైతులు రబీ కూరగాయల సాగులో రైతులు సస్యరక్షణ పద్ధతులను పాటించాలని కేంద్ర సమగ్ర సస్యరకణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఏ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం ధారూర్ మండల పరిధిలోని కేరెల్లి గ్రామంలో రైతు వేదికలో రబీలో కూరగాయల సాగులో పాటించవలసిన  సమగ్ర సస్య రక్షణ పద్ధతులు గురించి ప్రాంతీయ రైతులకు  రైతు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సునీత  సస్య రక్షణ అధికారి, తాండూరు ఏఆర్ఎస్ శాస్త్రవేత్త యమున, సస్య  రక్షణ అధికారి నీల రాణి, సమగ్ర  సస్య రక్షణ పద్ధతులను వివరించారు. ఇట్టి కార్యక్రమంలో రైతులు పాల్గొని సస్య రక్షణ పద్ధతులను పాటించడంలో కావలిసిన మెలకువలు, ఉపయోగాలు తెలుసుకున్నారు. ఇట్టి కేంద్రం వారు ప్రదర్శించిన సస్య రక్షణ పద్ధతులు గురించి అడిగి తెలుసుకున్నారు.  ఈ రెండు రోజులు  కార్యక్రమంలో ఒక రోజు వారికి బోధన ద్వారా, మరుసటిరోజు పంట క్షేత్రాన్ని సందర్శించి లింగాకర్ష క బట్టల ఉపయోగించే విధానం తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తపల్లి నర్సింహారెడ్డి, ఉద్యాన శాఖ అధికారులు అర్చన, కమల, అంకిత్, అబ్దుల్ గఫార్, వ్యవసాయ అధికారులు ఏఓ జ్యోతి, మండలం లోని ఏ.ఈ.ఓ లు  పాల్గొని కార్యక్రమని విజయవంతం చేశారు.