కుమ్మరి కుల వృత్తి వారికి పెన్షన్ ఇవ్వాలి

Published: Monday June 28, 2021
కొడిమ్యాల, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : కుమ్మర్లకు కుల వృతి పింఛన్ ఇవ్వాలని (కుమ్మర శాలివహన సంక్షేమ సంఘం తెలంగాణ) డిమాండ్ చేస్తుంది. బీసీ.బి లో ఉన్న కుమ్మర్ల ని ఏ ప్రభుత్వం స్వాతంత్రo వచ్చిన నుండి అదుకోలేదు. కుల వృత్తుల పై ఆధారపడి జీవిస్తున్న కుమ్మర్లకు ప్లాస్టిక్, స్టిల్, అల్యూమినియం వల్ల కులవృతి దెబ్బతింనది. బీసీ.బి లో ఉన్న కొన్ని కులముల వారికే పెన్షన్ ప్రమాద బీమా వస్తుంది. కానీ మా కుమ్మరి కులవృత్తి కి సంబదించిన మట్టి కుంటలు కబ్జాలకు గురైన పట్టించుకునే నాధుడు లేడని అయిలాపురం గంగవిష్ణు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఒక ప్రకటనలో తెలిపారు. కులవృత్తి తో జీవనం గడుపుతున్న మా కుమ్మర్ల కు ఎలాంటి పెన్షన్లు, ప్రమాద బీమ రావడంలేదు. కావున వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయాలని (కుమ్మర శాలివహన సంక్షేమ సంఘం తెలంగాణ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.