పల్లె ప్రగతితో పల్లెల్లో పండుగ వాతావరణం

Published: Friday July 09, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జూలై 08 ప్రజాపాలన బ్యూరో : పల్లె ప్రగతితో అన్ని పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బంట్వారం మండలంలోని రొంపల్లి గ్రామం, కోట్ పల్లి మండలంలోని కొత్తపల్లి, రాంపూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి, హారితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంందర్భంగా ఎమ్మెల్యే మాాట్లాడుతూ.. గ్రామంలోని వివిధ వార్డుల్లో పర్యటించి, చేపడుతున్న పనులను పరిశీలించారు. పల్లెప్రగతితో గ్రామాలను అందంగా తీర్చిదిద్దుకోవాలని సూూచించారు. పల్లెల్లో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని గుర్తు పేర్కొన్నారు. పారిశుధ్యం, పిచ్చిమొక్కలను తొలగించడం, డ్రైనేజీల్లో చెత్త తొలగించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని వివరించారు. అదేవిధంగా సీజనల్‌ వ్యాధులపై ప్రతిఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. నాల్గవ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనం, హరితహారం నర్సరీ, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డును సందర్శించి పలు సూచనలు చేశారు. ఏడవ హరితహారంలో భాగంగా మొక్కలను నాటి, నీరు పోయడం జరిగిందని తెెలిపారు. అనంతరం గ్రామ పారిశుధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు మరియు విలేకరులకు శాలువ, పూలమాలలతో సన్మానం చేసి, గ్రామస్థులకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు ఉమాదేవి, మల్లయ్య, అనితా రెడ్డి, ఎంపీపీ లు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, ఏఎంసి చైర్మన్ మల్లేశం, పిఏసిఎస్ చైర్మన్ రాంచంద్రా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, అనిల్, సర్పంచుల సంఘం అధ్యక్షులు నర్సింలు, వెంకటేష్ యాదవ్, రైతు బంధు అధ్యక్షులు ఖాజా పాష, సత్యం, నోడల్ ఆఫీసర్ డిసిఎస్ఓ రాజేశ్వర్, ఎంపిడిఓ లు బాలయ్య, లక్ష్మినారాయణ, ఎంఆర్ఓ రసూల్, ఎం పీ ఓ డేనియల్, విజయ్ ఎం ఏ ఓ లు సంధ్య, పాండు రంగాచారి ఏ పీ ఓ అంజిలయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, గ్రామస్థులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.