కల్యాణలక్ష్మీ పథకం పేదల జీవితాల్లో వెలుగులు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Tuesday November 22, 2022
మేడిపల్లి, నవంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి)
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం  పేదింటి ఆడబిడ్డల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.
హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ మండల తాసిల్దార్ గౌతమ్ కుమార్ అధ్యక్షతన సోమవారం జరిగిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్లు                  బండారు శ్రీవాణి వెంకట్రావు, జేరిపోతుల ప్రభుదాస్, పన్నల దేవేందర్ రెడ్డి, శాంతి సాయి జన శేఖర్, మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డిలతో కలిసి 285 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ఆడబిడ్డలకు తోబుట్టు పెద్దన్న లాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటూ వారి పెళ్లిళ్లకు ఒక లక్ష నూట పదహారు రూపాయల ఆర్థిక సహాయం అందించడం గొప్ప పరిణామం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్  మండల డిప్యూటీ తహసిల్దార్ ఎండి రఫీ, 
ఆర్ ఐలు సుధా, నహీద అజీమ్, సీనియర్ అసిస్టెంట్ అనంతరాములు, నాగలక్ష్మి, నరసింహ, సుమన్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం రవికుమార్,  గరిక సుధాకర్, మేకల ముత్యం రెడ్డి, కాటేపల్లి రవీందర్ రెడ్డి, పల్లె నర్సింగరావు, పిట్టల నరేష్, నంది కంటి శివ, ఎండి ముస్తాక్, కోరపాక అంజి, జెసిబి రాజు తదితరులు పాల్గొన్నారు.