జన్నారం చెరువులను కాపాడండి. ..అన్యాక్రాంతం అయిన చెరువు శిఖం భూములను స్వాధీనం చేసుకోవాలి ...గం

Published: Tuesday March 07, 2023
జన్నారం, మార్చి 06, ప్రజాపాలన:
 
 
జన్నారం చెరువులను కాపాడాలని,
అన్యాక్రాంతం అయిన చెరువు శిఖం భూములను స్వాధీనం చేసుకోవాలి
గంగపుత్ర సంఘం మండల అధ్యక్షుడు కల్లేడ నర్సయ్య డిమాండ్ చేశారు. చెరువు భూమి కబ్జా కు గురైదనే ఆరోపణలు నేపధ్యంలో మండలంలోని తపాల్ పూర్ గ్రామం పరిధిలోని సంగరాయిపేట చేపలు చెరువును సోమవారం ఆయన పరిశీలించారు. ఈసందర్బంగా విలేకరుల తో మాట్లాడారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చాలా గ్రామాల్లో చెరువు శిఖం భూములు కబ్జాకు గురైతున్నవని దీనివల్ల  చేపలు పట్టుకు జీవించే గంగపుత్రులకు ఉపాధిపై తీవ్ర ప్రభావం పడిందన్నారు.  అలాగే వందల ఎకరాల కు సాగునీటి ని అందించే చెరువు లు అస్థిత్వాన్ని కోల్పోయి చిన్న చిన్న కుంటలు గా మారాయని అన్నారు.  రైతులకు కూడా తీవ్ర నష్టాలు ఎదురుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మండలంలోని అన్ని చెరువులు, కుంటలను పూర్తిగా సర్వే చేయించి హద్దులు గుర్తించి, కంచెలు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. లేనియెడల పెద్దఎత్తున గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  కార్యదర్శి శాఖపురం రాజన్న, ముఖ్య సలహాదారులు ఏరుగట్ల మల్లయ్య, కల్లేడ భూమయ్య, పళ్ళికొండ రాజన్న, కల్లేడ నరేష్, శాఖపురం ప్రసాద్, శాఖపురం రాజన్న తదితరులు పాల్గొన్నారు.