లింగరాజుపల్లి ఉప సర్పంచ్ ఎన్నిక

Published: Wednesday October 06, 2021
వలిగొండ, అక్టోబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని లింగరాజుపల్లి గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నిక మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికలో బొడిగే రాజ్ కుమార్ ను ప్రత్యేక  అధికారి రమ్య ఆధ్వర్యంలో మెజారిటీ వార్డ్ సభ్యుల తీర్మాణం మేరకు ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డుపల్లి ఉమాదేవి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, వార్డు సభ్యులు గంగదారి లావణ్య, గంగధారి యశోద, పులి కృష్ణ, బొడిగే నర్సింహా, బొడిగే యాదయ్య, గంగదారి ఆశయ్య, గంగధారి రాజు, పబ్బు నర్సింహా, బొడిగే శివ, బాలగోని సతీష్ తదితరులు పాల్గొన్నారు.