పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Published: Monday June 07, 2021

 - వివిధ రాష్ట్రాల ఐ ఎ ఎస్  అధికారుల పిలుపు
అమీర్ పేట్ జోన్ (ప్రజాపాలన ప్రతినిధి ) : పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వివిధ రాష్ట్రాల ఐఏ ఎస్ అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐడీఓవటర్ సస్టైనబుల్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ డైరెక్టర్ దీపిక జోషి ఏర్పాటుచేసిన  వర్చువల్ మీటింగ్ లో దేశంలోని శాఖలలో పనిచేస్తున్న ఐ ఏ ఎస్ అధికారులు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రెటరీ జయేష్ రంజన్, అస్సాం హయ్యర్ ఎడ్యుకేషన్, స్కూల్స్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కళ్యాణ్ చక్రవర్తి, ఆంధ్ర ప్రదేశ్ ఫిషరీస్ కమిషనర్ కన్నబాబు, ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ఇమిటేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సీఈవో రాజబాబు, రాజస్థాన్ జైసల్మేర్ కలెక్టర్ ఆశిష్ మోడీ, ఐ సి ఎస్ ఎల్ కార్యదర్శి భబితాలు  మాట్లాడారు. మానవాళి  మనుగడకు పర్యావరణంతో ముడిపడి ఉంది అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ ను పరిరక్షించుకు నేందుకు హరితహారం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ప్రతి ఒక వ్యక్తి  చిన్ననాటినుండే పర్యావరణం పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పాఠశాల స్థాయినుంచి జీవవైవిద్యం  విద్యను అస్సాం ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. దీనికి విద్యార్థులు నిర్వహించే "బయోడైవర్సిటీ రిజిస్టర్" ఉదాహరణ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాగితం ఆధారిత పనులను మార్చడానికి డిజిటల్ పరిష్కారాలను అనుసంధానం చేయాలని కోరారు.