డయాబెటిక్ నివారణ కు శ్రీ క్యూర్ ప్రొడక్ట్

Published: Monday April 18, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : డయాబెటిక్ వ్యాధి గ్రస్తుల నివారణకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన శ్రీ క్యూర్ ఔషధాన్ని శ్రీ వర్ ఫార్మా కంపెనీ ఆదివారం మార్కెట్లో కి విడుదల చేసింది. హైదరాబాద్ లోని మారియట్ హోటల్ జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ చైర్మన్లు రామకృష్ణ, ప్రభావతి, మేనేజింగ్ డైరెక్టర్లు అరుణ్ ఠాగూర్, కల్పన లు ఆవిష్కరించారు. అనంతరం సోమాజిగూడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ చైర్మన్ రామకృష్ణ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. డయాబెటిక్, సొరియాసిస్, బొలుసు తదితరుల వ్యాధుల సత్వర నివారణకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రకృతి పరంగా లభించే ఆయిల్స్, విటమిన్ల సమ్మేళనంతో ఈ ఔషధాన్ని తయారు చేసినట్టు వివరించారు. అమెరికా మార్కెట్లో సక్సెస్ అయిన ఈ డ్రగ్ పేటెంట్ హక్కులను ఇండియా లో తమ సంస్థ పొందిందని తెలిపారు. అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ ఠాగూర్ మాట్లాడుతూ... ప్రతి సామాన్యుడికి శ్రీ క్యూర్ ప్రొడక్ట్ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్లీనిక్ లొనే కాకుండా తమ ఉత్పత్తులను డోర్ డెలివరీ చెయ్యనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తమ సంస్థ ద్వారా ఎముకల పటుత్వం కొరకు మల్టీ విటమిన్, ఔషధాలను మార్కెట్ లో ప్రవేశ పెట్టామన్నారు. ముఖ్యంగా డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు శ్రీ క్యూర్ ప్రొడక్ట్ ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు. ఈ ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 300 , ఇండియా వ్యాప్తంగా రాబోయే ఐదేళ్లలో 10 వేలకు పైగా థెరపటిక్ క్లినిక్ లను ప్రారంభించ నున్నట్టు ఆయన పేర్కొన్నారు.