కర్రి రాజేశ్వరరావుకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన... అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్య

Published: Wednesday December 21, 2022
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక బంజార లో సీఎం సహాయనిధి నుండి వచ్చినటువంటి చెక్కులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు & ప్రభుత్వ విప్ & పినపాక  శాసనసభ్యులు గౌ.శ్రీ రేగా కాంతారావు  ఆదేశాల మేరకు. కర్రి వెంకటరాజేశ్వరరావు... 44000/_ రూపాయల సీఎంఆర్ఎఫ్  నుండి వచ్చిన చెక్కులను  వారి ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేసిన....మండల BRS పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ మరియు టిఆర్ఎస్ మండల నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటుందని పేద ఇంటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాగా ఆపద వచ్చిన ప్రతి పేదవాడికి సీఎం సహాయం చేస్తున్నారని దానిలో భాగంగానే గతంలో ఆరోగ్యం బాగోలేనటువంటి కర్రి రాజేశ్వరరావుకు సీఎం సహాయ నిధి కింద సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించడం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఏ విధంగా సహాయం చేస్తుందో అద్దం  పడుతుందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ  కంచుగట్ల వీరభద్రం, ఎక్స్  ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,నెల్లిపాక సర్పంచ్ గొర్రెముచ్చు వెంకటరమణ,నెల్లిపాక ఎంపీటీసీ  గాదె జయ,సినియర్ నాయకులు చిలక వెంకటరమయ్య,నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ,మండలం బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్.కె  నయీమ్,గడకారి రామకృష్ణ బెల్లం వెంకటేశ్వరరావు,గాదె వెంకటేశ్వర్లు,జూపెల్లి కిరణ్,ఈసంపల్లి పున్నరవు,మందా హుస్సేన్,కడారి వేణు,కన్నెబోయీనా వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.