కుక్కల బెడదపై ప్రత్యేక చర్యలు తీసుకుంటాం

Published: Tuesday January 03, 2023
: వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 02 జనవరి ప్రజా పాలన : కుక్కల బెడద ఎక్కువైందని డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమంలో బాధితులు ఫిర్యాదు చేశారని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమంలో భాగంగా 24 ఫిర్యాదులు అందాయన్నారు. ఇంటి ముందు చిన్నపిల్లలు ఆడుకుంటుంటే కుక్కలు దాడి చేస్తున్నాయని పట్టణ ప్రజలు ఫిర్యాదు చేశారని తెలిపారు. వెంటనే స్పందించిన చైర్ పర్సన్ కుక్కల బెడదపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధానంగా డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల రిపేర్లు, చెట్లతో సమస్యలు లాంటివి చైర్ పర్సన్ దృష్టికి వచ్చినవని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిఓ శ్రీధర్, డిఈ రామ్ కిషన్, ఏఈ రాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మొహీనుద్దీన్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.