కుల్కచర్ల, దోమ పోలీస్ స్టేషన్లు తనిఖీ

Published: Monday February 07, 2022
వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటి రెడ్డి ఐపిఎస్
వికారాబాద్ బ్యూరో 06 ఫిబ్రవరి ప్రజాపాలన : గంజాయి, డ్రగ్స్, గుట్కా, నిర్మూలన కొరకు అవగాహన కార్యక్రమలు నిర్వహించాలని వికారాబాద్ జిల్లా ఎస్పి ఎన్.కోటిరెడ్డి సూచించారు. ఆదివారం కుల్కచెర్ల, దోమ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా రిసెప్షన్, స్టేషన్ రికార్డు రూమ్,  cctns రైటర్ రూమ్, కోర్ట్ మానిటరింగ్ఆఫీస్, జనరల్ డైరీ, స్టేషన్ పరిధిలో నేరస్తుల జాబితా, లాకప్, పార్కింగ్, మరియు పరిసరాలు పరిశిలించారు.  అనంతరం పోలీస్ స్టేషన్లలోని రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులు, కేసుల్లో పురోగతి, కేసులను దర్యాప్తు చేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను ఆన్లైన్లో పొందుపరుస్తూ 5s ఇంప్లిమెంట్ చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు పూర్తి భరోసా, ధైర్యం ఇచ్చేలా, ఇన్వెస్టిగేషన్ నిర్వహించాలని, ఎటువంటి పిటిషన్లు పెండింగ్లో లేకుండా తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించే సమయంలో సమయపాలన తప్పకుండా పాటించాలని, వృత్తిపట్ల నిబద్ధత, క్రమశిక్షణ కలిగి ఉండాలని హితవు పలికారు. అలాగే సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటువంటి నేరాలు జరగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని దానికి అనుగుణంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, ప్రతిరోజు వాహనాలు తనిఖీ చేయాలని, విజిబుల్ పోలీసింగ్ చేయాలని కంటిన్యూ పెట్రోలింగ్ చేస్తూ ఉండాలని ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై నిఘా ఏర్పాటు చేయాలని, సమస్యలు సృష్టించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అవసరమైతే రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. రోజురోజుకు కరోనా ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న వల్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణ కింద కేసు నమోదు చేయాలని తెలిపారు. గుట్కా, గంజాయి లాంటి నిషేధిత పదార్థాలు అమ్మకాలు, అక్రమ రవాణా నిరోధించడం, అక్రమ వ్యాపారులు చేసే వారి పైన కఠినంగా వ్యవహరించాలని అని అలాగే డయల్ 100 కాల్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ గారు సూచించారు. ఇట్టి కార్యక్రమంలో పరిగి డి‌ఎస్‌పి శ్రీనివాస్, పరిగి సి‌ఐ వెంకటరామయ్య, కుల్కచెర్ల ఎస్‌ఐ గిరెన్న, మరియు  దోమ ఎస్‌ఐ రమేశ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.