సివిల్ సప్లై హమాలీల రేట్లు పెంచాలి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్

Published: Wednesday June 15, 2022
 ఆసిఫాబాద్ జిల్లా జూన్ 14(ప్రజాపాలన, ప్రతినిధి) :
 
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఒప్పందం రేట్లు ముగిసి 6నెలలు అయినప్పటికీ ప్రభుత్వం నూతన రేట్లు అమలు చేయడం లేదని, వెంటనే నూతన రేట్లను అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో హమాలీ కార్మికుల సమావేశంలో ఉపేందర్ మాట్లాడుతూ ఈనెల 16న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉదయం 11 గంటలకు జరిగే సివిల్ సప్లై అమాలి కార్మికుల ధర్నా ను విజయవంతం చేయాలని కోరారు. కార్మికుల డిమాండ్లు సమాధి కార్మికుల రేట్లు రూ30 పెంచాలని, బోనస్ 10 వేలు ఇవ్వాలని, జీవో ప్రకారం ఈఎస్ఐ సౌకర్యం కల్పించి, మహిళా స్పీకర్ లకు నెలకు రూ 10 వేలు ఇవ్వాలని, తదితర హక్కుల సాధన కై ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సివిల్ సప్లై వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్టుపల్లి సుధాకర్, కార్యదర్శి హేమాజీ,నాయకులు దివాకర్, శ్రీనివాస్,కొమురక్క, ప్రకాష్, లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area