ఘనంగా కల్వకుంట్ల చంద్రసేన గుప్తా జయంతి ఉత్సవాలు.

Published: Friday September 02, 2022
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 01, ప్రజాపాలన:  
 
వాసవీక్లబ్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన వాసవీ వారోత్సవాలలో భాగంగా మొదటిరోజు గురువారం వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా జయంతి ఉత్సవాలను మంచిర్యాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీక్లబ్స్ మంచిర్యాల ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చదువు కోసం నిర్వహిస్తున్న సరస్వతి పథకం దాతలైన గోల్డెన్ స్టార్ దాత కొండా చంద్రశేఖర్ తో పాటు సిల్వర్ స్టార్ దాతలు కటుకం హరీష్, ముక్తా శ్రీనివాస్, అప్పాల శ్రీధర్, కొంకుముట్టి వెంకటేశ్, పల్లా కిరణ్ కుమార్, రాచకొండ లక్ష్మణ్ ను వాసవీక్లబ్స్ సత్కరించారు. ఈ సందర్భంగా సన్మానగ్రహీతలు మాట్లాడుతూ, వాసవీక్లబ్ గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు కులాలకు అతీతంగా సరస్వతి పథకంను ప్రతిష్టాత్మకంగా నిరుపేద విద్యార్థులకు చేయూతను ఇస్తుందని అన్నారు. ఈ పథకం ద్వారా దాతల సహకారంతో నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, కావాల్సిన పాఠ్యాంశ సామాగ్రిని, నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తుందని అన్నారు. అనంతరం ఇటీవల నిర్వహించిన వాసవీకన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అన్నదానంకు సహకరించిన దాతల్లో ఒకరైన మోటూరి సంపత్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవీక్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, వనితాక్లబ్ అధ్యక్షురాలు గౌరిశెట్టి ధనలక్ష్మి, కోశాధికారి కటుకం సునీత, కపుల్స్ క్లబ్ అధ్యక్షుడు గడ్డం రమేష్, క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్, రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్, జోన్ చైర్మన్ కాచం సతీష్ తదితరులు పాల్గొన్నారు.