ముగిసిన పదవ తరగతి అంతర్గత రికార్డుల వెరిఫికేషన్మ

Published: Wednesday April 13, 2022
మధిర ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు ప్రభుత్వ ఆదేశాల మేరకు పదవ తరగతి అంతర్గత రికార్డుల వెరిఫికేషన్ ప్రోగ్రాo విజయవంతంగా పూర్తయిందని మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పదవ తరగతి పరీక్షల్లో మంచి స్కోర్ సాధించడానికి కీలకం కానున్న అంతర్గత రికార్డుల మార్కుల నమోదు ప్రక్రియ అమలుతీరును పరిశీలించిన మధిర టీం లీడర్స్ బి.నాగేశ్వరరావు, ఎమ్ నారాయణ, జివిఎన్ రాజులను వారి టీమ్ మెంబర్స్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రికార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయుటకు సహకరించిన మధిర మండల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అభినందిస్తూ మే చివరి వారంలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల వరకు  నిర్విరామ కృషి చేస్తూ మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాదేవపురం హైస్కూల్ హెచ్ఎమ్ బి.నాగేశ్వరరావు టి వి ఎం స్కూల్ హెచ్ ఎం ఎం నారాయణ, ఇల్లూరు హెచ్ఎం జీవిఎన్ రాజు లతో పాటు వెరిఫికేషన్ టీమ్ మెంబెర్స్ కోట జయరాజు, ఆర్ విజయ శ్రీ, బివిబిఎన్ ఎమ్ శర్మ, సాదం వెంకటేశ్వరరావు, అహ్మద్ ఖాన్, సంగమేశ్వర రావు, సంక్రాంతి శ్రీనివాసరావు, అబ్దుల్ బక్షి, మేడేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.